బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన పర్యటనలో భాగంగా ఎపి డీజీపీనీ కలిసిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు డాక్టర్. అర్. జీ ఆనంద్... కీలక వ్యాఖ్యలు చ్చేసారు. డిజిపి తో కలసి రాష్ట్రం లోని జిల్లాల ఎస్పీలు, సి డబ్ల్యుసి ఛైర్మన్ లు, వివిధ శాఖ ల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి , పోలీస్ శాఖను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు డాక్టర్. అర్. జీ ఆనంద్ అభినందించారు. యువ ముఖ్యమంత్రి సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ విశేషమైన సేవలను అందిస్తుంది అని ఆయన అన్నారు.

అదే విధంగా పోలీస్ శాఖపై కూడా ఆయన ప్రసంశల వర్షం కురిపించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు విశేష కృషి చేస్తుంది అని ఆయన అన్నారు. ఆపరేషన్ ముస్కన్ నిరంతర ప్రక్రియ తో బాల బాలికలకు విముక్తి కల్పించడం, పునరావాసం కల్పించడం లో దేశంలోనే ఎపి పోలీసు ముందుంది అని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు డాక్టర్. అర్. జీ ఆనంద్ అన్నారు. మహిళలు, బాలబాలికల సంరక్షణకు ప్రత్యేక శద్ర తీసుకుంటుంది ఆనంద్ కొనియాడారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది అని ఆనంద్ కొనియాడారు. మహిళల రక్షణ, బాల కార్మికులు నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల పనితీరు దేశానికే రోల్ మోడల్ అని అన్నారు. అలాగే దిశ  గురించి ఇప్పటివరకు కేవలం విన్న కానీ ఈరోజు దిశ అంటే ఏమిటి... దిశ మహిళలకు ఉపయోగపడే విధానం పైన డీజీపీ గారు స్పష్టం గా వివరించారు అని పేర్కొన్నారు. టెక్నాలజీ వినియోగంతో మెరుగైన సేవలను అందిస్తూ అగ్రస్థానంలో నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను ఆయన కొనియాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: