ఇక ఇక్కడ నుంచే అసలు రచ్చ మొదలైంది. మంత్రి అప్పలరాజుపై టీడీపీ నేతలు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా బాబాయ్-అబ్బాయ్‌లైన అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులు మంత్రిని టార్గెట్ చేశారు. అటు లచ్చన్న మనవరాలు, టీడీపీ నాయకురాలు శిరీష సైతం మంత్రిపై విరుచుకుపడుతున్నారు.
తాజాగా మంత్రి సొంత నియోజకవర్గం వేదికగా బాబాయ్-అబ్బాయ్‌లు రాజకీయ వేడి లేపారు. పలాసలోని గౌతు లచ్చన్న విగ్రహానికి పాలాభిషేకం చేసి, మంత్రిపై మండిపడ్డారు. లచ్చన్న అందరి వాడని... ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రికి సంస్కారం లేదని, వెంటనే మంత్రి అప్పలరాజు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి కనుసన్నల్లో పలాసలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయని, అలాగే రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు తొలగించగలరా అని ప్రశ్నించారు. క్షమాపణ చెబితే మంత్రికి గౌరవం పెరిగేదని, ఎలాంటి అనుమతులు లేకుండా వైఎస్ విగ్రహాలు వీధుల్లో పెట్టారని విమర్శించారు.
అయితే రాజకీయాలకు అతీతంగా లచ్చన్నని అందరూ గౌరవిస్తారు. కానీ మంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయడం, శ్రీకాకుళంలో వైసీపీకే ఇబ్బంది అవుతుందనే వాదనలు వస్తున్నాయి. కాకపోతే లచ్చన్నపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, టీడీపీ నేతలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి సైడ్ నుంచి స్టేట్‌మెంట్ వచ్చింది. కానీ ఈ విషయంలో మంత్రికే కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి