ఈ మధ్య కాలం లో మనుషుల ప్రాణాల కు అసలు విలువ లేకుండా పోతుంది అన్న విషయం తెలిసిందే.  రోజు రోజుకు టెక్నాలజీ పెరగడం ఏమో కానీ మనుషుల ఆలోచన తీరు మాత్రం దారుణం గా మారి పోతుంది.  కొంతమంది టెక్నాలజీకి అనుగుణం గా ఎంతో పరిపక్వత సాధిస్తూ ఉంటే ఇంకొంత మంది టెక్నాలజీ పెరుగుతుంటే అనాగరిక సమాజం లోకి వెళ్ళి పోతున్నారు. దీంతో రోజు రోజుకు ఉన్మాదులు గా మారిపోతున్న ఎంతో మంది ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదికి వస్తున్నాయి  అన్న విషయం తెలిసిందే.


 అయితే ఈ మధ్య కాలంలో ఏకంగా కనీ పెంచిన తల్లిదండ్రులను సైతం దారుణంగా హతమారు స్తున్నారు ఎంతోమంది . ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. నవమాసాలు మోసి కానీ అల్లారుముద్దుగా పెంచిన తల్లి విషయంలో కాస్త కనికరం చూపించలేకపోయాడు ఆ కొడుకు. మద్యం మత్తు ఏకంగా అతని ఉన్మాదిగా మార్చేసింది. జన్మనిచ్చిన తల్లి అన్న విషయాన్ని కూడా మరిచి దారుణంగా కన్నతల్లినే హతమార్చాడు ఇక్కడొక కొడుకు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.



 తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో చోటు చేసుకున్నది  ఈ ఘటన. ఎస్సార్ నగర్ బల్కంపేట లో కొడుకు తల్లిని దారుణంగా హతమార్చాడు. కర్ణాటకకు చెందిన మహిళ బతుకుతెరువు కోసం హైదరాబాద్ నగరం వచ్చింది. ఈ క్రమంలోనే తన కొడుకు సంతోష్ తో కలిసి నివాసం ఉంటుంది. కాగా  ఇటీవలే మద్యం మత్తులో ఇంటికి వచ్చిన కొడుకు కన్న తల్లి తో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఉన్న కత్తితో తల్లి కడుపులో విచక్షణారహితంగా పొడిచి తల్లి ప్రాణాలను బలి తీసుకున్నాడు.  ఇక రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే సదరు యువకుడికి మతిస్తిమితం లేదని స్థానికులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: