ప్రపంచాన్ని మొత్తం గడగడలాడిస్తున్న కరోనా  వైరస్ చైనాలో ఊహన్  నగరం లో పుట్టింది అన్న విషయం తెలిసిందే. ఊహాన్ లోని ఫిష్ మార్కెట్ లో కరోనా  వైరస్ పుట్టింది అని అటు చైనా చెబుతున్నప్పటికీ.. ఊహన్ లో  ఉన్న లాబ్ లో  ఈ మహమ్మారి వైరస్ పుట్టింది అని ప్రపంచం మొత్తానికీ తెలుసు. అయితే కరోనా వైరస్ ఊహన్ లోని  ల్యాబ్ లో పుట్టింది అన్నది జగమెరిగిన చైనా  దాచిన సత్యం. ఇక అంతే కాకుండా కరోనా వైరస్ గురించి అన్నీ నిజాలు తెలిసినప్పటికీ ప్రపంచదేశాలకు మొత్తం వ్యాప్తి చెందే వరకు మనిషి నుంచి మనిషికి ఇది వ్యాప్తి చెందుతుంది అని నిజాలు దాచి ప్రపంచ వినాశనానికి సంకల్పించింది చైనా.



 అదే సమయం లో కరోనా వైరస్ మూలాలను కనుగొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు ఊహన్ నగరంలో పరిశోధనలు జరిపేందుకు వెళ్తుంటే వారిని అడ్డగించి మరింత దారుణంగా వ్యవహరించింది.  ఆ తర్వాత తాము కరోనా వైరస్ ను బాగా కట్టడి చేసామని ఇతర దేశాలకంటే కరోనా వైరస్ ను ఎంతో అద్భుతంగా నియంత్రించగలిగాము అంటూ  గొప్పలు చెప్పుకుంది చైనా. ఇక చైనా కల్ల బొల్లి మాటలు చెప్పినా అటు ప్రపంచ దేశాలు మాత్రం నమ్మే పరిస్థితిలో  లేవు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో  భారత్ లో ఉన్న కొంతమంది మాత్రం చైనా చెప్పింది నిజమే అని భారత్లో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తారు.



 భారత్ లో ఉంటున్నప్పటికీ   భారత దేశాన్ని తక్కువ చేసి చూపిస్తూ ఇతర దేశాలను పొగడడమే పనిగా పెట్టుకుంటారు కొంతమంది. ఈ క్రమంలోనే ఇలాంటి వాళ్లు ఇటీవల ఒక కొత్త రకం ప్రచారం మొదలుపెట్టారు.  కరోనా వైరస్ కు పుట్టినిల్లు అయిన చైనాలో ఊహన్  నగరం ఎంతో సురక్షిత నగరం అని.. ఏడాది క్రితం ఊహన్ లో  మొదటి కరోనా మరణం జరిగితే ఏడాదిలోపే ఊహన్ సురక్షిత నగరం గా మారిపోయిందని ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఇలా భారత దేశంలో ఉంటూ దేశాన్ని తక్కువ చేస్తూ విదేశాల గురించి అబద్దపు  గొప్పలు  చెప్పడం సిగ్గుచేటు అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: