ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో పోలీసుల పనితీరు విషయంలో ఇప్పుడు విపక్షాలు చాలా సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. రాజకీయంగా అధికార పార్టీలు బలంగా ఉండటంతో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో పోలీసులు  ఇబ్బందిగా ప్రవర్తిస్తున్నారని పోలీసులతో మేము సన్నిహితంగా ఉండాలి అని ప్రయత్నం చేసినా సరే పోలీసులు మాత్రం తమ విషయంలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

జనగామ జిల్లాలో జరిగిన ఘటనపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం గా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి బీజేపీ అధిష్టానం కొన్ని నివేదికలు అడిగినట్లు సమాచారం. బీజేపీ కార్యకర్తల మీద పోలీసులు లాఠీఛార్జి చేసిన అంశాన్ని బీజేపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది అని తెలుస్తుంది. కేంద్ర హోంమంత్రి... బండి సంజయ్ కి ఫోన్ చేశారని సమాచారం. అసలు ఏం జరుగుతుంది ఏంటనే దానిపై ఆయన ఆరా తీసినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ విషయంలో ఎవరెవరు ఉన్నారు వారి వివరాలను తమకు ఇవ్వాలని అంతేకాకుండా జిల్లా ఎస్పీని కూడా తమకు నివేదిక కావాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలు అడిగినట్లుగా తెలుస్తోంది.

దీనిపై ఇప్పటికే నివేదిక కూడా సిద్ధం చేసినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే బండి సంజయ్ మాత్రమే  హోం మంత్రిని కలిసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అవసరమైతే డిజిపిని ఢిల్లీ కూడా పిలిచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని అంటున్నారు. సాధారణంగా విపక్షాలు నిరసన చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ పోలీసులు ఇష్టం వచ్చినట్టు దాడులు చేయడంతో ప్రజలలో కూడా ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: