ఆంధ్రప్రదేశ్ లో  కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన  24 గంటల్లో రాష్ట్రంలో 44,679 శాంపిళ్లను పరీక్షించగా..అందులో  203 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8  లక్షల 85వేల కి చేరింది .. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే అత్యధికంగా గుంటూరు జిల్లాలో 41  కరోనా పాజిటివ్ కేసులు రాగా అత్యల్పంగా ప్రకాశం లో రెండు కేసులు వచ్చాయి ..అలాగే రాష్ట్రం మొత్తంగా  చూసుకుంటే అతితక్కువ యాక్టివ్ కేసులు  విజయనగరం జిల్లాలో 32  కేసులు  ఉండగా ఆ తర్వాత  శ్రీకాకుళం జిల్లాలో 62  కేసులున్నాయి...

రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,134కి చేరింది. గడిచిన  24 గంటల్లో కరోనా భారీ నుండి  231 మంది  కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య ఎనిమిది లక్షల 75  వేలకి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి ..   మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు చూసుకుంటే పండగపూట క్రమేపి  తగ్గిపోతున్నాయి .. గడిచిన గంటల్లో దేశంలో కొత్తగా 15 వేల పాజిటివ్ కేసులు వచ్చాయి .. దీంతో మొత్తం కరోనా  కేసుల సంఖ్య కోటి నాలుగు లక్షల 95వేలకు చేరింది.ఇందులో కోటి ఒక లక్ష 29  వేల మంది కోలుకోగా , ప్రస్తుతం దేశం లో రెండు లక్షల 14  వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి .. అలాగే మరణాల సంఖ్య చూస్తే ఈరోజు కరోనాతో 202 మంది మరణించారు .. దీంతో కరోనా మరణాల సంఖ్య ఒక లక్ష 51  వేలకి చేరింది .. సంక్రాంతి సందర్బంగా ఆంధ్రప్రదేశ్ లో  కరోనా కేసులు తగ్గడం నిజంగా సంతోషించదగ్గ విషయం .. ఇక  వ్యాక్సిన్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో వ్యాక్సిన్ పంపిణీపై ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది ..
 

మరింత సమాచారం తెలుసుకోండి: