చలి ఇక్కడొక మతిస్థిమితం లేని 20 ఏళ్ల యువకుడి ప్రాణం తీసింది. ఆరోగ్యం పాడు చేసి కాదు.. అందరిలో  అనుమానం కలిగించి  తల్లి ప్రాణాలు తీసింది. చలి ఎక్కువగా పెట్టడంతో చలికి తాళలేక మతిస్థిమితంలేని ఒక 20 ఏళ్ల యువకుడు వ్యవసాయ క్షేత్రంలో తలదాచుకున్నాడు  చివరికి..  ఆ యువకుడు దొంగ అని గ్రామస్తులందరూ దారుణంగా కొట్టి తుపాకీతో కాల్చడంతో చివరికి ఈ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..  ఫిరోజాబాద్ జిల్లా ఖేరియా గ్రామానికి చెందిన సన్నీ యాదవ్ అనే 20 ఏళ్ల యువకుడు రెండు రోజుల కిందట..  నాగ్లా నావజ్  గ్రామం వెళ్ళాడు.



 ఈ క్రమంలోనే ఉదయం 5 గంటల సమయంలో అతడు గ్రామ శివారులో ఉన్న ఓ వ్యక్తి వ్యవసాయ క్షేత్రం ఉండగా ఇక చలి  తీవ్రతరం కావడంతో.. అక్కడ ఒక పొద చాటున తలదాచుకుని వణుకుతున్నాడు. ఈ క్రమంలోనే అక్కడ రైతు అతని గమనించాడు. ఇక పశువులు దొంగతనం చేసేందుకు అతను వచ్చాడు అని భావించిన యజమాని.. వెంటనే  రైతులతో పాటు గ్రామస్తులు అందరికీ కూడా సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు చలికి వణుకుతూ పొదల్లో తలదాచుకున్న యువకుడిపై మూకుమ్మడిగా దాడి చేయడంతో పాటు  చివరికి తుపాకీతో కాల్చడంతో యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.




 సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే తన కొడుకుకు  మతిస్థిమితం లేదని ఆ మాత్రం కూడా తెలుసుకోకుండా గ్రామస్తులు అందరూ చితకబాదారు అంటు  తండ్రి బోరున విలపించాడు. దోషులు  అందరికీ కఠిన శిక్ష పడాలి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొంత మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: