తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కాన్పు కోసం వెళ్తే బిడ్డను మాయం చేశార‌ని  ఓ మహిళ తిరుపతి ప్రభుత్వ ఆస్పత్రిలో హల్ చల్ చేసింది. కాన్పు కోసం వచ్చిన తనకు వైద్యులు గర్భం రాలేదంటున్నారంటూ  ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. ఈ ఘటన తిరుపతి ఆస్పత్రిలో జ‌రిగింది. ఈ సంఘ‌ట‌న ఆదివారం తిరుప‌తి ప‌ట్ట‌ణంలో పెద్ద కలకలమే రేపింది. వివరాలప్రకారం నెల్లూరుజిల్లా సూళ్లూరుపేటకు చెందిన శశికళ అనే మహిళ తిరుపతిలో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో చికిత్స కోసం వస్తున్నారు. అయితే.. ఆదివారం ఆస్పత్రికి వచ్చిన సదరు మహిళ ఆస్పత్రి సిబ్బందిపై పలు ఆరోపణలు చేసింది. గర్భంలోని శిశువును మాయం చేశారంటూ వైద్యులపై ఆగ్రహించింది. ఆస్పత్రి తీరును తప్పుపడుతూ నిరసన వ్యక్తం చేశారు. అయితే.. ఆస్పత్రి సిబ్బంది మాత్రం అలిపిరి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. సదరు మహిళ గాలి బుడగలను గర్భంగా భావించిందని పేర్కొన్నారు. వైద్యుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అలాగే మహిళ మానసిక స్థితిపైడా విచారణ చేపట్టారు. కడుపులో గాలి బుడగలను గర్భంగా భావించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.


 వైద్యుల ఫిర్యాదు మేరకు ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా అయితే అసలు శశికళ కడుపులో బిడ్డే లేదని, తమను మోసం చేస్తున్నారంటూ ఆస్పత్రి వైద్యులు.. శశికళను, ఆమె భర్త సురేశ్‌ను పోలీసులకు పట్టించారు. శశికళకు తొమ్మిది నెలలు నిండాయని.. గ్రామంలో శ్రీమంతం కూడా జరిపామని కుటుంబీకులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా విడుదల చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. అసలు శశికళ గర్భం దాల్చిందా లేదా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. శశికళ పాత రిపోర్ట్‌లను పరిశీలిస్తున్నామని.. బాధితులు ఏ ఆస్పత్రికి తీసుకెళ్లమంటే అక్కడి తీసుకెళ్లి మళ్లీ వైద్యపరీక్షలు నిర్వహిస్తామంటున్నారు. శశికళకు నిన్న డెలివరీ డేట్ ఇచ్చి అడ్మిట్ చేసుకున్నారని బాధిత కుటుంబీకులు చెబుతున్నారు. తమ బిడ్డను మాయం చేసి తమపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి: