దిస్‌పూర్: ఒక్క చిన్న తప్పు వల్ల  వందల వ్యాక్సిన్ డోసులు దెబ్బతిన్నాయి. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సాధారణంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను -8 డిగ్రీల సెల్షియస్ వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా ఇదే తరహాలో వ్యాక్సిన్‌లను నిల్వ చేయడం జరుగుతోంది. సీరమ్ ఇన్‌‌స్టిట్యూట్ తయారు చేసిన కోవీషీల్డ్ వ్యాక్సిన్ అయినా.. భారత్ బయోటెక్ తయారు చేసిన కొవ్యాగ్జిన్ అయినా ఇదే నిబంధనలకు లోబడి నిల్వ చేయాల్సి ఉంటుంది. అయితే అస్సాంలోని సిల్చార్ మెడికల్ కళాశాలలో ఆసుపత్రిలో అధికారులు మాత్రం తమ వద్దకు వచ్చిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ డోసులను నిల్వ చేయడంలో ఓ చిన్న తప్పు చేశారు. -8 డిగ్రీల సెంటీగ్రేడ్‌లో నిల్వ చేయడానికి బదులు కేవలం సబ్ జీరో(0 డిగ్రీల కంటే తక్కువ) ఉష్ణోగ్రతలో నిల్వ చేశాడు. దీంతో దాదాపు 1000 వ్యాక్సిన్ డోసులు దెబ్బతిన్నాయి.

వ్యాక్సిన్‌లను ఐఎల్ఆర్ ఉష్ణోగ్రత వద్ద ఉంచడం వల్ల అవి పాక్షికంగా స్తంభించినట్లు కాచర్ జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్‌లో సాంకేతిక లోపం వల్ల ఉష్ణోగ్రత పెరిగిపోయిందని చెప్పారు. దీంతో దీనికి బదులుగా ఆసుపత్రికి మరో బ్యాచ్‌ ఈ వ్యాక్సిన్‌లను పంపించాలని అసోం వైద్యఆరోగ్య శాఖ నిర్ణయించినట్లు వెల్లడించారు. అయితే ఈ ఘటనపై సరైన నివేదికను పంపించాలని ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించినట్లు అసోం ఆరోగ్యం శాఖ తెలిపింది.

ఇదిలా ఉంటే ఈ నెల 16వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించారు. ఇప్పటికే దాదాపు మూడు రోజుల నుంచి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. అన్ని రాష్ట్రాల్లోనూ వ్యాక్సిన్ అందజేత కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు వ్యాక్సిన్‌లను అందిస్తున్నారు. తొలి విడతలో 3 కోట్ల మందికి వ్యాక్సిన్‌లను అందించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అందులో పోలీసులు  వైద్య ఆరోగ్య సిబ్బందికి, పోలీసులకు, పారిశుధ్య కార్మికులకే మొదటగా వ్యాక్సిన్‌లను అందిచనున్నట్లు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: