ప్రపంచంలో చాల వింతలు ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో వింత ఆచార సంప్రదాయాలు ఉంటాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని నాగేన హళ్లి అనే గ్రామంలో ప్రజలు, పాములు కలిసి జీవిస్తారు. ఏ ఇంటికి వెళ్లినా అక్కడ గుట్టలుగుట్టలుగా పాములు ఉంటాయి. ఆ పాములు వారిని కాటు వేసినా.. వారికి ఏమీ కాదు. ఆ వూరి రహస్యమేంటో ఇప్పటి వరకూ సైన్ కు అందని మిస్టరీగా మిగిలిపోయింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఒకప్పుడు ఈ గ్రామంలో యతీశ్వర స్వామి అనే సాధువు నివసించేవారు. ప్రతి రోజూ ఉదయం గామంలో ఇంటింటికి వెళ్ళి బిక్షమెత్తి హనుమాన్ గుడి పరిసరాల్లో విశ్రాంతి తీసుకొంటూ ఉండేవారట. ఒక రోజు ఆయన బిక్షం ఎత్తుకొని తిరిగి హనుమాన్ గుడికి వస్తుండగా.. ఒక చోట పొదల మధ్య పడి ఉన్న శిశువును ఆయన చూశారు.. ఆ బిడ్డను చేరదీశారు. ఈ క్రమంలో ఆ మగబిడ్డకు 12 ఏళ్ళు నిండాయి. రోజూలా సాధువు పిల్లవాడిని గుడి దగ్గర విడిచి బిక్షం ఎత్తుకోవడానికి ఊర్లోకి వెళ్లారు. ఇక తిరిగి హనుమాన్ గుడికి వచ్చేసరికి పాము కాటుకి గురై ఆ బాలుడు మరణించాడు.

ఇక దీంతో ఆ సాధువు ఆగ్రహంతో నాగరాజుని శపించడానికి యత్నించాడు. ఈ విషయం పసిగట్టిన నాగరాజు సాధువుని క్షమించమని వేడుకొన్నాడు. అంతేకాదు.. పాముకాటుకు గురైన ఆ బిడ్డను బతికించాడు. దీంతో సాధువు శాంతించి ఇకపై గ్రామంలో నివశించే వారి మీద లేదా.. గ్రామంలో ఉన్న వారిపై ఏ విధమైన సర్పం విషయం పనిచేయదని, గ్రామం దాటితే పాము విషం పనిచేస్తుంది అని చెప్పారు.

అంతేకాదు.. ఈ గ్రామంలో నివసించే ప్రజలకు సాధువు కొన్ని నియమాలు ఏర్పాటు చేశాడు.. గ్రామంలో ప్రజలు మాంసాహారం భుజించరాదు. సర్పాలను చంపరాదు. ఒక వేళ తెలిసి గానీ, తెలియక గానీ ఈ నియమాలను అతిక్రమిస్తే.. తీవ్ర పరిమాణాలను ఎదుర్కోవలసి వస్తుంది అని ఆ సాధువు చెప్పాడట. ఐతే ఈ యతీశ్వర స్వామి ఏ శతాబ్ధానికి చెందిన వాడో తెలియదు కానీ సాధువు కథ ఒక తరం నుంచి మరో తరానికి ఇలా కొనసాగుతూ వస్తోంది. ఈ గ్రామంలో 70 వరకు ఇండ్లు ఉంటాయి. ఆ గ్రామంలో ఇళ్లలోనూ, తోటల్లోనూ, పొదల్లోనూ, తాచుపాములు స్వేచ్ఛగా సంచరిస్తాయి. ఆ పాములను తమ పెంపుడు జంతువుల్లా భావిస్తూ ఆ గ్రామస్థులు తమ పని తాము చేసుకుని పోతుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: