ఈ మధ్య కాలంలో శానిటైజర్ ల వాడకం ఎంతలా పెరిగి పోయింది ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యం గా కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా శానిటైజర్ తప్పక వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమం లోనే రోజు రోజుకు శానిటైజర్ వాడకం పెరిగిపోతున్న నేపథ్యం లో అటు మార్కెట్లోకి ఎన్నో రకాల శానిటైజర్ లు కూడా తెరమీదికి వస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రస్తుతం శానిటైజర్ ఉపయోగించటం కారణంగా చేతులకు అంటుకున్న  వైరస్ ని నాశనం చేయవచ్చు అనే ఉద్దేశంతో ఎంతో మంది వాడుతున్నారు అన్న విషయం తెలిసిందే.



 అయితే ప్రస్తుతం కరోనా  వైరస్ వ్యాప్తి దృశ్య శానిటైజర్ లు వాడటం మంచిది. కానీ శానిటైజర్ ల వాడకం మితిమీరితే మాత్రం  ఏకంగా ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది తగిన జాగ్రత్తలు పాటిస్తూ శానిటైజర్ వాడుతుంటే మరికొంతమంది మాత్రం ఇక అవగాహన లేమితో ఎక్కువగా శానిటైజర్ లు వాడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చిన్న పిల్లలు శానిటైజర్ ఉపయోగించిన సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.


 శానిటైజర్ ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల చిన్న పిల్లలు కళ్ళు దెబ్బ తింటున్న ట్లు ఇటీవలే పరిశోధకులు చెప్పుకొచ్చారు. చేతులకు శానిటైజర్ రాసుకున్న తర్వాత పిల్లలు తమకు తెలియకుండానే కళ్ళకు శానిటైజర్ రాసుకుంటున్నారట. తద్వారా ఎంతో మంది పిల్లలకు కంటి సమస్యలు ఏర్పడుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. శానిటైజర్ లో ఆల్కహాల్ తో పాటు మరిన్ని రసాయనాలు ఉండటం తో కళ్లపై ఇది ఎంతగానో ప్రభావం చూపుతుందని పరిశోధకులు తెలిపారు. అందుకే పిల్లలను శానిటైజర్ లకు దూరంగా ఉంచి సబ్బుతోచేతులు కడుక్కోవటానికి ఎక్కువగా ప్రోత్సహించాలి అంటూ తల్లిదండ్రులకు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: