దేశంలో ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా నీరుగారిపోయింది. సోనియా గాంధీ తర్వాత సరైన నాయకత్వం లేక పార్టీ ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయింది. ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డిపాజిట్లు పొందే పరిస్థితి కూడా లేదు.. అందుకు కారణం ఎదో తేలీదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు శాసించిన ప్రాంతీయ పార్టీ లను అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.  దేశంలో ఎలా ఉన్నా, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో మరింత దయనీయ పరిస్థితి కి చేరుకుంది..

తెలంగాణ వచ్చిన తరువాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ దే ఎప్పుడు పైచేయి ఉంటుందని భావించారు కానీ కేసీఆర్ తెరాస తో కాంగ్రెస్ పై నెగ్గాడు. ఇటీవలే జరిగిన గ్రేటర్ ఎన్నికలు ఎంత ఉత్కంఠభరితంగా సాగాయో అందరికి తెలిసిందే.. తెరాస పార్టీ కి వన్ సైడ్ అవుతుందనుకున్నారు అంతా కానీ బీజేపీ ఎంట్రీ తో ఈ రెండు పార్టీ లమధ్య పోరు ఎంతో ఆసక్తి కరంగా మారిపోయింది. బీజేపీ గెలుపుతో తెరాస వాయిస్ మూయగబోయింది.. ప్రచారంలో బీజేపీ తన జోరు ను చూపించింది.. తెరాస కి షాక్ ఇచ్చేలా ప్రచారం చేసింది..  ఈ రెండు పార్టీ లు గ్రేటర్ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోగా హోరాహోరీగా ప్రచారాల్లో పోటీపడ్డాయి. అయితే మెజారిటీ ప్రజలు బీజేపీ నే నమ్మారు. టీ ఆర్ ఎస్ గెలిచినా నైతికంగా ఇక్కడ బీజేపీ నే గెలిచింది అనుకోవచ్చు..

దేశ ప్రయోజనాలను కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను కూడా బీజేపీ కాంగ్రెస్ కు దూరం చేస్తుంది. వచ్చే ఎన్నికలకు సమాయత్తమవ్వడానికి ఒక్క కాంగ్రెస్ పార్టీకే శక్తి సరిపోదన్నది వాస్తవం. కాంగ్రెస్ దాదాపు అన్ని రాష్ట్రాల్లో బలహీనంగా ఉంది. ప్రాంతీయ పార్టీలు అన్ని రాష్ట్రాల్లో ఆధిక్యతను కనపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూపీఏ అనేది వచ్చే ఎన్నికల్లో ఉంటుందా? లేదా? అన్నది పార్టీలోనే చర్చగా మారింది. ఇంతకు ముందు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ వైపు చూసేవి. ఇప్పుడు అదే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మద్దతు కోసం ఎదురు చూపులు చూస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: