ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత ప్రఖ్యాతి గాంచినదో  లో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.  కాలం తో సంబంధం లేకుండా ఎప్పుడూ తిరుమల తిరుపతి దేవస్థానం లో భక్తులు భారీగా తరలి వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పునీతులు అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కోరిన కోరికలు తీర్చే బంగారు దేవుడిగా ఆపద మొక్కులవాడు గా తిరుపతి కొండ పై వెలసిన శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం దేశ నలు మూలల నుంచి తరలి వస్తుంటారు భక్తులు.


 సాధారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం లో ఎప్పుడు చూసినా కూడా భక్తుల రద్దీ ఎక్కువ గానే ఉంటుంది అనే విషయం తెలిసిందే. కానీ కరోనా  వైరస్ వెలుగులోకి వచ్చిన నేపథ్యం లో ఇక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మూసివేశారు.  కరోనా  వైరస్ కేసుల సంఖ్య కాస్త నియంత్రణలోకి వచ్చిన నేపథ్యంలో క్రమక్రమంగా భక్తులకు అనుమతి సంఖ్యను పెంచుతు  కీలక నిర్ణయాలు తీసుకుంటుంది టీటీడీ బోర్డు.  ఇక ఎన్నో రోజుల నుంచి శ్రీవారిని దర్శించుకకో  లేకపోయినా భక్తులు భారీగా తరలి వచ్చి ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరుకుంటున్నారు.



 దీంతో రోజురోజుకు భక్తుల రద్దీ పెరిగి పోతూనే ఉంది. అయితే నిన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని 47 వేల తొమ్మిది వందల మంది భక్తులు దర్శించుకున్నారు. 19345 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు అర్పించారు. ఇక నిన్న ఒకేరోజు శ్రీవారి హుండీ ఆదాయం మూడు కోట్ల గా ఉంది. కరోనా  వైరస్ పరిస్థితులు సద్దుమణుగుతున్న  నేపథ్యంలో శ్రీవారి హుండీ ఆదాయం అంతకంతకూ పెరిగిపోతోంది అనే విషయం తెలిసిందే.  భక్తుల తాకిడి రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో శ్రీవారి హుండీ ఆదాయం కూడా పెరిగిపోతూ ఉంది అని టీటీడీ అధికారులు కూడా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: