ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన కూతళ్ల హత్యల కేసులో మరోసారి సంచలన విషయాలు బయటికి వచ్చాయి. ఈ ఘటన జరగడానికి పెద్దమ్మాయి అలేఖ్యే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పురుషోత్తం, పద్మజ దంపతుల చిన్నకూతురు రెండు వారాల క్రితం పెంపుడు కుక్కతో బయటకు వెళ్ళింది. ఆ సమయంలో బయట ఏదో ముగ్గు తొక్కినట్లు దివ్య అనుమానం వ్యక్తం చేసింది. అదే భయంతో మరుసటి రోజు నుంచి అనారోగ్యం పాలైన దివ్య.. తాను చనిపోతానన్న భయంలోనే ఉండిపోయింది.

ఇక ఈ నెల 23న దివ్యకు భూత వైద్యుడితో తల్లిదండ్రులు తాయెత్తులు కట్టించారు. దివ్య ఈ నెల 24న ఏడుస్తూ ఇంటి మేడపైకి వెళ్లింది. అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు తల్లిదండ్రులు ఆమెను వేపాకులతో కొట్టారు. అదే రోజు రాత్రి డంబెల్స్‌ తో తలపై కొట్టి చంపారు. ఇక ఈ కేసులో ఏ-1గా పురుషోత్తం నాయుడు, ఏ-2గా పద్మజను చేర్చారు. హత్య కేసులు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి విచిత్రంగా ప్రవర్తిస్తున్న పురుషోత్తంనాయుడు, పద్మజలు.. విచారణలో కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

విచారణలో అడిగిన ప్రశ్నలకు వారు చెప్తున్న సమాధానాలు వింటుంటే షాక్ తినడం పోలీసుల వంతవుతోంది. ఏమడిగినా వారి సమాధానులు దేవుళ్లు, దెయ్యాల చుట్టూనే తిరుగుతున్నాయి. శివుడు వస్తాడని., తమ కుమార్తెలు కూడా తిరిగొస్తారని చెప్పడంతో పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. కూతుళ్లను చేజేతులా హత్య చేశామన్న పశ్చాత్తాపం కొంచెం కూడా వారిలో కనిపించడం లేదు. అయితే పోలీసులు కరోనా టెస్టులకు తీసుకెళ్లగా.., నేను శివుడ్ని నాకు కరోనా ఏంటీ.. అంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతేకాదు కరోనాను సృష్టించింది చైనా కాదని.. తానే కరోనాను ప్రపంచం మీదకు వదిలాలని పోలీసులతో చెప్పినట్లు సమాచారం. తమ కూతుళ్లకు పట్టిన దెయ్యాన్ని వదిలించడం కోసమే డంబెల్ తో కొట్టామని.., వాళ్లిద్దరూ ప్రాణాలతో తిరిగి వస్తారని చెప్పారు. అలేఖ్య, సాయిదివ్య అంటే తమకు ప్రాణమని.., చదువుల్లోనూ వారు నెంబర్ వన్ అని చెప్పినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: