తెలంగాణ ప్రభుత్వంలో త్వరలో మార్పులు ఉంటాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేటీఆర్ కు పట్టాభిషేకం ఖాయమని గులాబీ నేతలే చెబుతున్నారు. అయితే కేసీఆర్, కేటీఆర్ తో పాటు ఆ కుటుంబ సభ్యులెవరు ఈ వార్తలపై స్పందించడం లేదు. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నానరని తెలుస్తోందది. ఫిబ్రవరి 1న కేసీఆర్ జన్మదిన వేడుకులకు ఎల్బీ స్టేడియం వేదిక కానుందని చెబుతున్నారు. టీఆర్ఎస్ ముఖ్య నేతలు కేసీఆర్ కోసం.. స్టేడియం నిర్వాహకులతో మాట్లాడి ఫిబ్రవరి 17ను రిజర్వు చేసుకున్నట్లు తెలిసింది.

             కేసీఆర్ బర్త్ డే వేడుకలకు ఎల్బీ స్టేడియంలో నిర్వహించాలనుకోవడంతో కొత్త చర్చ జరుగుతోంది. జన్మదిన వేడుకలకు ఘనంగా నిర్వహించి.. ఇక ఆయనకు ముఖ్యమంత్రిగా వీడ్కోలు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి 17 తర్వాత ఏ రోజైనా కేటీఆర్ కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగిస్తారని చెబుతున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ .. తన బర్త్ డే ను  కేవలం ప్రగతి భవన్‌కే పరిమితం చేసుకున్నారు. తెలంగాణ భవన్‌కు కూడా రాలేదు. ఈసారి మాత్రం ఎల్బీ స్టేడియంలో జరగనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. దీంతో ప్రభుత్వంలో మార్పులు ఖాయమని తెలుస్తోంది.

          ప్రతీ సంవత్సరం కేసీఆర్ జన్మదినం సందర్భంగా పార్టీ శ్రేణులు రక్తదానం, అన్నదానం, ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయడం, సామాజిక సేవా కార్యకలాపాల్లో పాలుపంచుకోవడం లాంటివి జరిగేవి. ఈసారి అదనంగా ఎల్బీ స్టేడియంలో ఢిఫరెంట్‌గా నిర్వహించాలనుకుంటున్నారు.
నగరం నుంచి మాత్రమే కాకుండా అన్ని జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు ఇందులో భాగం పంచుకునేలా జిల్లా నాయకత్వానికి కూడా రాష్ట్ర నాయకులు విజ్ఞప్తి చేయనున్నారు. ఇంకా ఇరవై రోజులకు పైగా సమయం ఉన్నందున ఫిబ్రవరి రెండో వారంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: