అధికారం లోకి వచ్చినప్పటి నుంచి పథకాల విషయం లో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని  పథకాలను ప్రవేశపెడుతున్న జగన్ సర్కార్..  నిరుద్యోగుల విషయం లో మాత్రం మొండి వైఖరిని వీడటం లేదు అనడం లో అతిశ యోక్తి లేదు.  జగన్ సర్కార్ అధికారం లోకి వచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ కూడా..  ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విషయం లో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  అధికారం లోకి వచ్చిన కొత్తలో వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.



 అయితే జగన్ సర్కార్ నిరుద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు పై మాత్రం ప్రస్తుతం విశ్లేషకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఎందుకంటే ప్రతి ఏడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేస్తాము జగన్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు.  దీంతో తమకు ఉద్యోగాలు వస్తాయి అని ఎంతో మంది నిరుద్యోగులు భావించి జగన్ కి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించారు. అయితే అధికారం లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబంధించిన ఈ విషయాన్ని మరిచి పోయింది జగన్ సర్కార్ అని అంటున్నారు విశ్లేషకులు.



 జగన్ సర్కార్ పాలన మూడేళ్లు గడిచినప్పటికీ ఇప్పటి వరకు గతంలో హామీ ఇచ్చిన విధంగా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 కి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్  క్యాలెండర్ను జగన్ సర్కార్ విడుదల చేయక పోవడంతో ప్రస్తుతం ఎంతో మంది నిరుద్యోగులు జగన్ సర్కార్ తీరుపై అసంతృప్తితో వున్నారు అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే నిరుద్యోగులు అందరూ కూడా ఇక జగన్ సర్కార్ కు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: