భార్య భర్తల బంధం అంటే అన్యోన్యత కు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి అనే విషయం తెలిసిందే. కానీ నేటి రోజుల్లో మాత్రం భార్య భర్తల బంధం అంటే మనస్పర్థలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. అంతేకాదు ఆత్మహత్యలకు చిరునామాగా మారిపోయింది. ఎంతోమంది భార్య భర్తలు తరచూ గొడవలు పడుతూ ఉండడం మనస్పర్థల తో చివరికి మనస్థాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండటం లాంటి ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి అనే విషయం తెలిసిందే. దేవుడిచ్చిన జీవితాన్ని అర్ధాంతరంగానే ముగిస్తున్నారు నేటి రోజుల్లో మనుషులు. చిన్న చిన్న కారణాలకే తమ జీవితం వృధా అయిపోయింది అంటూ పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తూ మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారు.




 భార్య భర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవలని పెద్దదిగా చేసుకుంటూ చివరికి మనస్థాపం చెంది కట్టుకున్న వారిని ఒంటరి చేసి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.  ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. అతను ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి. మంచి జీతం..  ఇక అంతా సాఫీగా సాగిపోతుంది. కానీ ఇటీవలే భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ తలెత్తింది.  మాట మాట పెరిగి పోవడంతో ఈ చిన్నపాటి గొడవ కాస్త పెద్దదిగా మారి పోయింది. దీంతో భార్య తనకు ఎదురు చెప్పింది అనే కారణంతో మనస్థాపం చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి చివరికి ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.



 ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సాయి భార్గవ్ మంజు అనే యువతీ యువకులకు పెళ్లి జరిగింది. అయితే చెన్నైలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఇద్దరు ఇటీవల పటాన్చెరులోని ఇంద్రేశం లో ఓ  కాలనీలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం కావడంతో ఇంటి నుంచే పనిచేస్తున్నారు. అయితే ఇటీవలే ఏదో విషయంలో భార్యాభర్తలిద్దరూ మధ్య  గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన భర్త సాయి భార్గవ్ ఇక రూమ్ లోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: