ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి మరియు ప్రత్యర్థి పార్టీ టిడిపి కి మధ్య మరోసారి వివాదం చెలరేగింది. తెలుగుదేశం పార్టీ నేతపై ఓ రేంజ్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత మరియు ఏపీ మంత్రి. దాంతో మరోసారి ఏపీలో రాజకీయాలు భగ్గుమన్నాయి. వైయస్సార్సీపి మంత్రి శంకర్ నారాయణ టిడిపి నేత జెసి దివాకర్ రెడ్డి పై విమర్శల తుఫాన్ కురిపించారు. దివాకర్ రెడ్డి వైఖరి మితిమీరుతోందని, అయన ఎప్పుడో సరిహద్దు రేఖలు దాటారని... ఆయన నోటికి వచ్చినట్లు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారని ఆరోపించారు మంత్రి నారాయణ. జెసి దివాకర్ రెడ్డి గారు కాస్త..... జానీ వాకర్ రెడ్డి లాగా రూపాంతరం చెందినట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

మీ కల్లబొల్లి కబుర్లు వినడానికి ప్రజలు ఏమి అంత అమాయకులు కాదని... ఇలాగే అనవసరపు మాటలతో దూకుడు ప్రదర్శిస్తే అనంతపురం ప్రజలు మీ నాలుక కట్ చేస్తారంటూ ఘాటుగా మండిపడ్డారు. టిడిపి ప్రభుత్వం గురించి ఆంధ్ర ప్రజలకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని, ఆ పార్టీ చేసినంత మోసం మరెవరూ చేయలేదని..  అధికారంలో ఉండగా చంద్రబాబు గారు చేసిన మోసాలు కప్పిపుచ్చడం ఎవ్వరికీ సాధ్యం కాదని, అవన్నీ రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని విమర్శించారు మంత్రి నారాయణ. కాబట్టే ఏపీ ప్రజలు ఆయన్ని దూరం పెడుతూ వస్తున్నారని... తగిన గుణపాఠం నేర్పుతున్నారు అంటూ పేర్కొన్నారు. రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేసి 420 గా ముద్ర పడిన వ్యక్తి చంద్రబాబు అని... లెక్కలేనన్ని మోసాలు చేసిన ఆయన ప్రతిభను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరువలేని దుయ్యబట్టారు.

దివాకరరెడ్డి.. సీఎం జగన్‌ గురించి మాట్లాడడం దారుణమని..దివాకర్‌రెడ్డి కుటుంబ అకృత్యాల గురించి తాడిపత్రిలో ప్రతి ఒక్కరికి తెలుసని పేర్కొన్నారు పారదర్శక పాలనతో అభివృద్ధి పథం వైపు ముందుకు దూసుకెళ్తున్న జగనన్నను ఎవరూ అడ్డుకోలేరని... దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు ప్రతిష్టాత్మక పథకాలను పట్టం కట్టారు ముఖ్యమంత్రి జగన్ అంటూ తెలిపారు . అటువంటి మహోన్నత వ్యక్తి గురించి మాట్లాడే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకొని మాట్లాడాలంటూ ఫైర్ అయ్యారు. అయితే దీనిపై ఫైర్ బ్రాండ్ జేసీ ఇంకా స్పందించకపోవడం కొసమెరుపు. మరి ఏమి జరగనుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: