మహమ్మారి కరోనా సోకడంతో తమ కుటుంబం రోడ్డున పడిందంటూ, ఒకవైపు ఆరోగ్యాన్ని మరో వైపు ఆర్థికంగానూ భారీగా నష్టపోయాం అని అందుకు మూల కారణం తాము పనిచేస్తున్న కంపెనీ అని... కాబట్టి ఈ నష్టాన్ని కూడా ఆ కంపెనీ యాజమాన్యమే భర్తీ చేయాలంటూ కోర్టులో దాఖలు చేశారు ఓ వ్యక్తి మరియు అతని భార్య. అయితే  ఈ విషయమై కోర్టుకెక్కిన జంటకు అక్కడ చుక్కెదురైంది.. దాంతో దిక్కుతోచని పరిస్థితిలో సతమతమవుతున్నారు ఆ దంపతులు. ఇంతకీ వారు ఎవరు.. అసలు ఏమి జరిగిందో తెలుసుకుందామా...? అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో..కార్బీ-రాబర్ట్ అనే దంపతులకు సంబంధించిన విషయం. అయితే రాబర్ట్ విక్టర్ వుడ్ వర్క్స్ అనే సంస్థలో పనిచేస్తున్నాడు.

కరోనా కాలంలో వర్కర్లపై తమ సంస్థ చూపిన వైఖరే తనకు కరోనా సోకడానికి కారణమని పేర్కొన్నారు. ఆ సంస్థ వర్కర్లను ఒక చోట నుంచి మరో ప్రదేశానికి పదే పదే తీసుకెళ్లిందని, స్థానిక ప్రభుత్వాలు పెట్టిన నిబంధలను ఏమాత్రం పాటించలేదని అతడు ఆరోపించాడు. ఇలా శాన్ ఫాన్సిస్కోలో పలు ప్రదేశాలకు మార్చడం వల్ల ముందు తనకు కరోనా సోకిందని,  ఆ తర్వాత తన భార్యకు వ్యాప్తి చెందిందని పేర్కొన్నాడు. దీని కారణంగా తాము ఆస్పత్రుల చుట్టూ తిరిగి ఆర్థికంగా ఎంతో నష్టపోయామని... అదే విధంగా ఆరోగ్యం కూడా దెబ్బతిందని వాపోయారు.

ఇలా ఇది అంతా జరగడానికి మూల కారణమైన వుడ్ వర్క్స్ సంస్థ యాజమాన్యమే ఈ మా నష్టాన్ని భరించాలి అంటూ..దీనికి ఎలాగైనా కోర్ట్ వారు బాధ్యత తీసుకోవాలని వారిని ఆశ్రయించింది. అయితే ఈ కేసును పరిశీలించిన న్యాయస్థానం... ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ఈ వ్యాజ్యం కార్మికుల పరిహారాలకు చెందిన ప్రత్యేక నిబంధన కిందకు వస్తుందని  పేర్కొంది. ఈ నిబంధన కింద కంపెనీ యాజమాన్యంపై వారు కేసు వేయలేరని స్పష్టం చేసింది. కేసును మరో సారి పునఃపరిశీలించి సవరణలు చేసి మరోసారి కేసు వేసే అవకాశాన్ని ఆ దంపతులకు కలిగించింది న్యాయస్థానం. అయితే ఊహించని విధంగా తీర్పు రావడంతో అవాక్కయ్యారు ఆ దంపతులు. ప్రస్తుతం ఏం చేయాలంటూ యోచనలో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: