తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరో గుర్తింపును దక్కించుకుంది. మినీ ఇండియాగా పేరుగాంచిన భాగ్యనగరం ఉద్యోగులు ఇష్టపడే నగరాల్లో టాప్ లో నిలిచింది. ఉన్నత చదువులు చదివిన యువత..ఉద్యోగంలో స్థిరపడేందుకు హైదరాబాద్‌నే ఎంపిక చేసుకుంటున్నట్లు వెల్లడైంది. దేశంలోకెల్లా ఉద్యోగార్థులు అత్యంత ఎక్కువగా ఇష్టపడే నగరాల జాబితాలో హైదరాబాద్‌ తొలి స్థానంలో నిలిచిందని వీబాక్స్, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ), టాగ్డ్‌ సంస్థ సంయుక్తంగా రూపొందించిన ‘ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్‌–2021’వెల్లడించింది. ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్న నగరాల్లోనూ హైదరాబాదే ముందంజలో ఉంది. హైదరాబాద్‌ తర్వాత బెంగళూరు, పుణే, ఢిల్లీ ఉద్యోగానికి అనువైన నగరాలుగా, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్న సిటీలుగా నిలి చాయి.

దేశవ్యాప్తంగా 65 వేల మంది విద్యార్థులతోపాటు 15 పరిశ్రమలను, 150కిపైగా కార్పొరేట్‌ సంస్థలను సంప్రదించింది. పలు అంశాలపై అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించింది.క్రిటికల్‌ థింకింగ్‌లో తెలంగాణ విద్యార్థులు టాప్‌–10 జాబితాలో 4వ స్థానంలో నిలిచారు. ఆంగ్లభాషా నైపుణ్యంలో రాష్ట్ర విద్యార్థులు ఐదో స్థానంలో ఉన్నారు. న్యూమరికల్‌ స్కిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు ఐదో స్థానంలో ఉండగా తెలంగాణ విద్యార్థులు 8వ స్థానంలో ఉన్నారు. కంప్యూటర్‌ స్కిల్స్‌లో తెలంగాణ విద్యార్థులు 9వ స్థానంలో ఉన్నారు.వృత్తి, సాంకేతిక విద్యా సంబంధ ఉద్యోగాలకు అవసరమైన స్కిల్స్‌ పరంగా చూస్తే రాజస్తాన్‌ విద్యార్థులు ముందంజలో ఉన్నారు. టాప్‌–10 రాష్ట్రాలవారీగా చూస్తే అక్కడి విద్యార్థులే తొలి స్థానంలో నిలిచారు

కేరళ అక్షరాస్యతలో ముందు వరుసలో ఉన్నా ఉద్యోగార్థులున్న టాప్‌–10 రాష్ట్రాల్లో ఆ రాష్ట్రం నిలువలేకపోతోంది. అయితే ఆంగ్ల భాష, న్యూమరికల్‌ స్కిల్స్‌లో మాత్రం టాప్‌–10లో నిలిచింది. మాతృ భాష కాకుండా రెండో భాషగా ఇంగ్లిష్, స్కిల్స్‌ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో రాజస్తాన్‌ తొలి స్థానం సంపాదించింది. హైదరాబాద్, బెంగళూరు, పుణే, ఢిల్లీ ఉద్యోగానికి అనువైన పట్టణాలుగా, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్న పట్టణాలుగా నిలిచాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: