టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాజాగా కృష్ణా జిల్లా పర్యటనకు వెళ్లిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. నారా లోకేష్ గతంలో కంటే ఇప్పుడు చాలా వరకు భిన్నంగా మాట్లాడుతున్నారు. సాధారణంగా తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే పెద్దగా దూకుడుగా మాట్లాడే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నేతలు ముందు నుంచి కూడా చేయరు. చంద్రబాబు నాయుడు కూడా ఎవరైనా దూకుడుగా మాట్లాడినా సరే కట్ చేసే ప్రయత్నం చేసే వాళ్ళు.

దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు అన్ని విధాలుగా సైలెంట్ గా ఉండటం మనం చూస్తూనే ఉండేవాళ్లం. అయితే ఇప్పుడు అనూహ్యంగా నారా లోకేష్ లో చాలావరకు మార్పు కనబడుతుంది అని చెప్పాలి. కార్యకర్తలకు ఏది కావాలో తెలుసుకుని నారా లోకేష్ ఇప్పుడు దూకుడుగా వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే క్రమంలో ప్రజల్లోకి బలంగా వెళ్తున్నారు. ఇప్పుడు కాస్త కార్యకర్తలకు దగ్గరయ్యే విధంగా విమర్శలు కూడా చేస్తున్నారు అని చెప్పాలి.

తాజాగా కృష్ణాజిల్లా పర్యటనలో భాగంగా ఆయన భాషలో కూడా చాలా మార్పు వచ్చింది. దీని పై తెలుగుదేశం పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు వైఖరిలో కూడా ఈ మధ్యకాలంలో మార్పు వచ్చిందని చెప్పాలి. ఇప్పటివరకు చాలా వరకు జాగ్రత్తగా వెళ్లిన చంద్రబాబు నాయుడు ఇక ముందు మాత్రం అలా వెళ్లే అవకాశాలు లేకపోవచ్చు. ఆయన కూడా దూకుడు రాజకీయం చేయవచ్చని... తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం కచ్చితంగా కక్ష సాధింపు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో ఎలాంటి అడుగుపడుతుంది ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిణామాలు మాత్రం కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: