సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. దేశంలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఎదోఒక్క ప్రాంతంలో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుండి సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న మహిళల వరకు అందరు కామాంధుల వికృత చేష్టలకు బలవుతూనే ఉన్నారు.

అయితే ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా అక్కడ మహిళలు, బాలికపై హింస కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌ లో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న మహిళపై కొందరు దుండగులు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను కిడ్నాప్ చేసిన ముగ్గురు వ్యక్తులు.. ఆపై గ్యాంగ్ రేప్ చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నోయిడాలోని గౌతమ్ బుద్ద నగర్‌కు చెందిన బాధిత మహిళ.. ఘజియాబాద్‌లోని ఓ ఆఫీస్‌లో పనిచేస్తోంది. అయితే బుధవారం రాత్రి సమయంలో ఆమె ఘజియాబాద్‌లోని లాల్ కౌన్ సమీపంలో ఆటో ఎక్కి ఇంటికి బయలుదేరింది. అయితే ఆమెను ఆటో డ్రైవర్, అతని ఇద్దరు స్నేహితులు కలిసి కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెపై అత్యాచారం చేశారు. తర్వాత బాధిత మహిళను హపూర్‌ జిల్లాలోని పిల్ఖువా ప్రాంతంలో విడిచిపెట్టి పరారయ్యారు.

అయితే ఘజియాబాద్‌ లోని మసూరి పోలీస్ స్టేషన్ నుంచి మా కంట్రోల్ రూమ్‌ కు గురువారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందింది. దీంతో పోలీసు సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి.. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించాం" అని హపూర్ అడిషనల్ ఎస్పీ సర్వేష్ మిశ్రా తెలిపారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి పిల్ఖువా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధిత మహిళను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి పంపారు. బాధిత మహిళ ఘజియాబాద్ ఇందిరాపురంలోని ఓ షోరూమ్‌లో పనిచేస్తుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: