తెలంగాణ రాజ‌కీయాల్లో జ‌న‌సేన పార్టీని బ‌లోపేతం చేయాల‌ని ఆ పార్టీ అధ్య‌క్షుడు జ‌న‌సేనాని ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫిక్స‌య్యారు. అందుకే పార్టీ శ్రేణుల‌తో ఆయ‌న వ‌రుస‌గా భేటీలు నిర్వ‌హించాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఆదివారం గ్రేట‌ర్ హైద‌రాబాద్ నేత‌ల‌తో ఆయ‌న స‌మావేశ‌మైన విష‌యం తెలిసిందే. ఈస‌మావేశంలో పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ ముందుకు వెళ్లడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని… ఇప్పుడు పార్టీని తెలంగాణలో బలోపేతం చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ముందుగా గ్రేటర్ హైదరాబాద్ కమిటీని నియమించుకుందామని, అర్హులైన పేర్లను కార్యకర్తలే సూచించాలన్నారు.


కమిటీల ఏర్పాటు కూడా కార్యకర్తల అభీష్టం మేరకు జరుగుతుందన్నారు. ఇక నుంచి ప్రతినెలా కొన్ని రోజులపాటు తెలంగాణలో పార్టీ కార్యకలాపాల కోసం సమయాన్ని కేటాయిస్తానని కార్యకర్తలకు పవన్‌ హామీ ఇచ్చారు.  త్వ‌ర‌లోనే క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్ న‌గ‌రాట్లో ప‌వ‌న్ ప‌ర్య‌టను ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షాల‌కోస‌మైతే జ‌రిగిందో వాటి సాధ‌న‌కు జ‌న‌సేన పోరాటం చేస్తుంద‌ని స్ప‌ష్ట‌త ఇస్తుండ‌టం గ‌మ‌నార్హం. తెలంగాణ రాష్ట్రంలోని ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌పై దృష్టిపెట్టేందుకు పోరాడ‌టానికి, జ‌న‌క్షేత్రంలోకి వెళ్లేందుకు వ‌రుస ప‌ర్య‌ట‌న‌లు చేప‌ట్టాల‌ని ప‌వ‌న్ డిసైడైన‌ట్లుగా తెలుస్తోంది. ఓ వైపు ష‌ర్మిల తెలంగాణ‌ రాజ‌కీయాల్లోకి  వ‌స్తున్న క్ర‌మంలో ప‌వ‌న్ తీసుకున్న నిర్ణ‌యం ఆస‌క్తిగొల్పుతోంది.



కొద్దిరోజుల క్రితం నుంచే ప‌వ‌న్ తెలంగాణ రాజ‌కీయాల‌పై ఫోక‌స్ పెడుతున్నారు.  తెలంగాణలో జనసేన సంస్థాగత కమిటీలను ప్రకటించారు. విద్యార్థి, యువజన కమిటీలను పవన్‌కల్యాణ్ నియమించారు. జనసేన తెలంగాణ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా సంపత్‌ నాయక్‌ను ఎన్నుకున్నారు. విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణను నియమించారు. అంతేకాకుంగా యువజన విభాగం అధ్యక్షుడిగా వి.లక్ష్మణ్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శిగా కిరణ్‌కుమార్‌ను నియామించారు. జనసేన పార్టీ క్షేత్ర స్థాయిలో బలో పేతం దిశగా అడుగులు వేస్తోంది. 2019లో ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత పార్టీ సిద్దాంతలకు పదును పెట్టి ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ అధినాయకత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే వివిధ కమిటీలు ఏర్పాటు చేసి పార్టీని కిందిస్థాయినుంచి ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు ప‌వ‌న్‌.




మరింత సమాచారం తెలుసుకోండి: