చంద్రబాబు మీడియా మేనేజ్‌మెంట్‌లో కింగ్.. ఈ విషయాన్ని అంతా ఒప్పుకుంటారు. అసలు ఎన్టీఆర్ అంతటి వాడినే ఆయన బతికి ఉండగా టీడీపీ అధ్యక్ష పదవిని, సీఎం సీటును అందుకున్నాడంటే.. అందుకు కారణం ఆయన మీడియాను వాడుకున్న తీరే కారణమన్న వాదన కూడా ఉంది. ప్రజాకర్షణ లేకపోయినా.. చంద్రబాబును హీరోగా ఆనాటి మీడియా చూపించిందని.. దాని కారణంగానే ఆయన క్రమంగా నాయకుడిగా విజయవంతం అయ్యారని చెబుతారు.

అయితే ఇప్పుడు కొత్త చర్చ ఏంటంటే.. చంద్రబాబుకు ఇన్నాళ్లూ బలంగా మారిన మీడియా ఇప్పుడు ఆయన పతనానికి కారణం అవుతోందా.. చంద్రబాబును తప్పుదోవ పట్టిస్తోందా.. చంద్రబాబును  ప్రజల నుంచి  దూరం చేస్తోందా..అన్న వాదన వినిపించింది. ప్రత్యేకించి చంద్రబాబు సొంత మీడియాగా పేరు పడిన ఓ మీడియా హౌజ్ చేసిన అతి గత ఎన్నికల్లో చంద్రబాబు ఘోర పరాజయానికి కారణమన్న విశ్లేషణ కూడా ఉంది.

అసలు 2014 ఎన్నికల్లో చంద్రబాబు గెలుస్తాడన్న నమ్మకం ఈ మీడియాకు కూడా లేదు. కానీ అప్పటి రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర విభజన, రాష్ట్రానికి ఓ సీనియర్ సేవలు అవసరం అన్న కోణంలో జనం చంద్రబాబుకు అధికారం ఇచ్చారు. ఇక చంద్రబాబు సీఎం అయినదగ్గరనుంచి.. ఈ మీడియా అహో చంద్రబాబు.. ఓహో చంద్రబాబు అంటూ విపరీతమైన భజన మొదలు పెట్టింది. చంద్రబాబు ఏం చేసినా అద్భుతమే అన్నట్టు ప్రొజెక్టు చేసింది. చంద్రబాబుకు ఇతర ఫీడ్‌ బ్యాక్‌ లేకుండా చేసి అంతా అదుర్స్ అనిపించేలా అటు ప్రజలను, ఇటు చంద్రబాబును నమ్మించే ప్రయత్నం చేశారు.

ఈ అతి ప్రచారం వికటించింది.. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిపోయారు. అయినా ఇప్పటికీ ఈ మీడియా ఓవరాక్షన్ తగ్గడం లేదు. మళ్లీ చంద్రబాబును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది. చంద్రబాబుకు మేలు చేస్తున్నామని.. ఈ మీడియా ఆయనకు కీడే చేస్తోంది. జనసేన టీడీపీకి దగ్గరవుతోందని.. జనసేన టీడీపీ దగ్గరవుతున్నాయని ప్రచారం మొదలుపెట్టింది. అంటే ఏదో ఒక అండ లేకుండా చంద్రబాబు గెలవడనే ఆలోచనే ఇంకా జనంలోకి, టీడీపీలోకి తీసుకెళ్తున్నారు. ఇది టీడీపీకి నష్టం చేకూరుస్తుందని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: