అధికార పార్టీ వైసిపికి... ఎస్ఈసి ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి మధ్య మొదలైన పంచాయతీ ఎన్నికల పోరు ఏ రేంజ్ లో ముందుకు నడిచిందో... ఇరు తెలుగు రాష్ట్రాలకు తెలిసిందే. ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి సవాలుగా మారి ప్రతి విషయంలోనూ అభ్యంతరాలు తెలుపుతూ వచ్చిన ఏపీ ఎస్ఈసి నిమ్మగడ్డ, ఇప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా మారడం అందరిలోనూ ఆశ్చర్యాన్ని వ్యక్తం కలుగ చేస్తోంది. ప్రస్తుతం ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సందర్భంగా అధికార పార్టీకి అతీతంగా..వైసీపీ జెండా రంగులు, సీఎం జగన్ ఫొటోతో ఉన్న రేషన్ వాహనాలను తిప్పడం ద్వారా నగర ఎన్నికలపై ప్రభావం పడుతుందని... ఇటీవలే ఫిబ్రవరి 5 న... రాష్ట్రంలో రేషన్ పంపిణీ చేసే వాహనాలను నడప రాదని ఆదేశాలు జారీ చేశారు నిమ్మగడ్డ.

ఈ విషయంలో కోర్టులో ఫిర్యాదు కూడా చేశారు. కానీ వాహనాలు రంగులు మార్చడానికి మూడు నెలల సమయం పడుతుందని అదీ కాక దీని వలన రాష్ట్రంపై ఆర్థికంగా అధిక భారం పడుతుందని ప్రభుత్వం కోర్టుకు విన్నవించింది...ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. రేషన్ డోర్ డెలివరీ వాహనాలకు రంగులు మార్చాలన్న ఎస్ఈసీ ఆదేశాలను సస్పెండ్ చేసింది. మార్చి 15 వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.

అయితే ఈ విషయంపై జగన్ సర్కార్ కు షాక్ ఇచ్చారు ఎస్ఈసి. తొలి సారిగా  ఓ మెట్టు దిగారు నిమ్మగడ్డ. వాహనాల రంగుల అంశంపై తమ నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకునేందుకు అంగీకారం తెలిపారు ఎస్ఈసి. ఈ నిర్ణయంతో పిటిషన్‌ను డిస్పోజ్‌ చేసింది హైకోర్టు. ఈ వార్త  అధికార పార్టీకి సంతోషం కలిగించింది. కొందరు మాత్రం మీరు మారి పోయారు సార్ అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. మరి ఎన్నికల సమయానికి ఇంకెన్ని నిమ్మగడ్డ ఇంకెన్ని షాకులు ఇస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: