సాంప్రదాయంగా ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న కొన్ని అలవాట్లు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కానీ నేటి ఆధునిక జీవనశైలిలో మాత్రం సాంప్రదాయంగా వస్తున్న కొన్ని మంచి అలవాట్లు కూడా వదిలేస్తున్నారు చాలామంది.  ముఖ్యంగా నేటి రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితంలో భోజనం   కూడా సరిగ్గా చేసేందుకు టైం లేని పరిస్థితి నెలకొంది. ఆరోగ్యంగా ఉండడానికి సంతృప్తి చెందడానికి కాదు కేవలం కడుపునిండడానికి మాత్రమే నేటి రోజుల్లో భోజనం చేస్తున్నారు. చక చక భోజనం చేసామా  మళ్ళీ పని మొదలుపెట్టామా అన్న విధంగా ఉన్నారు నేటి రోజుల్లో జనాలు ఈ క్రమంలోనే భోజన శైలి  ఎలా ఉంది అన్నది మాత్రం ఎవరూ గమనించడం లేదు.



 భోజనం చేసేటప్పుడు ఎలాంటి అలవాట్లను పాటిస్తున్నారూ  అన్న దానిపై కూడా ఎవరు దృష్టి పెట్టడం లేదు. సాధారణంగా అయితే భోజనానికి అరగంట ముందు..  లేదా భోజనం చేసిన అరగంట తర్వాత మంచి నీళ్ళు తాగడం ఆరోగ్యానికి మంచిది అని చెబుతూ ఉంటారు పెద్దలు. కేవలం పెద్దలు చెప్పడమే కాదు అటు ఎన్నో అధ్యయనాల్లో కూడా ఇదే విషయం వెల్లడైంది.  ఆరోగ్య నిపుణులు కూడా ఇదే సూచిస్తూ ఉంటారు. అయితే కొంతమంది పెద్దలు నిపుణులు సూచించినట్లుగా  భోజనానికి ముందు భోజనం తర్వాత నీళ్ళు తాగుతారు కానీ కొంతమంది మాత్రంభోజనం చేస్తున్న సమయంలో నీళ్లు తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు.



 ఇకపోతే భోజనం చేస్తున్న సమయంలో ఎక్కువగా నీరు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానికరం అన్నది అర్థం అవుతుంది. భోజనం చేస్తుండగా నీళ్లు తాగడం వల్ల నీరసం అలసట అలాంటి వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు నిపుణులు. ఇక భోజనం సమయంలో నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణాశయంలో విడుదలైన జీర్ణరసాలు పలుచబడి పోయే అవకాశం ఉందని తద్వారా తీసుకున్న ఆహారం జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. తేన్పులు, అజీర్తి, కడుపు ఉబ్బరం మలబద్ధకం లాంటి సమస్యలు కూడా వస్తాయట. అయితే భోజనం సమయంలో పూర్తిగా నీరు తీసుకోవద్దు అని కాదు ఒకవేళ తీసుకోవాల్సి వస్తే..  కొద్ది కొద్దిగా మాత్రమే తీసుకోవటంమంచిదని అంటున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: