ప్రస్తుతం భారత రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికే ఎంతో సరికొత్త టెక్నాలజీని రైళ్లలో తీసుకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. రెగ్యులర్గా రైలు ప్రయాణాలు చేసేవారు ఇక అప్పుడప్పుడు వివిధ టూర్లకు రైళ్ల ద్వారా ప్రయాణాలు చేసేవారికి కూడా ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు వినూత్న సర్వీసులను భారత రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంటుంది.  సాధారణంగా ఎక్కువమంది రైలు ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు అన్న విషయం తెలిసిందే. బస్సు ప్రయాణం తో పోలిస్తే రైలు ప్రయాణాలు కాస్త సురక్షితం కావడం అంతేకాకుండా తక్కువ చార్జీలతో కూడిన ప్రయాణం కావడంతో ఎక్కువ మంది ప్రయాణికులు రైళ్లల్లో ప్రయాణించడానికి ఆసక్తి చూపుతుంటారు.



 అయితే ఒక గంట రెండు గంటల పాటు రైల్లో ప్రయాణిస్తే  పర్వాలేదు కానీ ఏకంగా కొన్ని గంటల పాటు లేదా ఒక రోజు పాటు రైళ్లలో ప్రయాణించాయాలి అంటే తెలిసిన వ్యక్తులు పక్కన లేకపోతే బోరింగ్ గా ఫీల్ అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక తెలిసిన వ్యక్తులు  పక్కన లేకపోయినప్పుడు ఇక ఎవరితో మాట్లాడాలో తెలియక పక్క వాళ్ళతో మాట్లాడితే ఏమనుకుంటారో అని మొహమాట పడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు ఎంతో మంది ప్రయాణికులు. చేతిలో సెల్ఫోన్ ఉన్నప్పటికీ కూడా.. సిగ్నల్ సరిగ్గా రాకపోవడంతో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ క్రమంలోనే ప్రయాణికులు అందరికీ ట్రైన్ జర్నీ  బోర్ కొట్టకుండా ఉండేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకొని ప్రయాణికులు అందరికీ శుభ వార్త చెప్పింది.



 రైల్వే శాఖ ఈ నెల నుంచి రైల్లో కంటెంట్ ఆన్ డిమాండ్ సేవలను ప్రారంభించేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలోనే రైళ్లల్లో జర్నీ చేసే ప్రయాణికులందరూ కూడా తమకు నచ్చిన సినిమాలు వినోద కార్యక్రమాలు ఇలా వివిధ రకాల కంటెంట్ ఎంచుకుని ఎక్కడ బోర్ కొట్టకుండా ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ఫ్రీ, పెయిడ్ మోడ్ లలో  ఈ సేవలు అందించేందుకు సిద్ధమయింది రైల్వే శాఖ. ఇక ప్రయాణికులు అందరికీ ఈ సేవలు అందించేందుకు రైల్వే  శాఖ ప్రస్తుతం రైళ్లలో సర్వర్లు ఏర్పాటు చేస్తోంది. దీంతో ఎక్కడ అంతరాయం కలగకుండా నిరంతరాయంగా రైలు ప్రయాణాలు చేస్తున్న ప్రయాణికులు వినోదాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: