తెలంగాణ హోమ్ మంత్రి మహమూద్ అలీ మనవడిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఫిర్యాదు చేశాడు. హోమ్ మంత్రి మనవడు ఫరాన్ తనను ర్యాగింగ్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదు లో పేర్కొన్నారు .  ఫరాన్ బంజారాహిల్స్ లోని ముఫరంజా ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. కాగా అదే కాలేజీకి చెందిన రియాన్ అనే విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేసి తన చేతికి ఉన్న గాయాలను మీడియాకు చూపించాడు. హోమ్ మంత్రి మనవడి నుండి తనను  కాపాడాలని పోలీసులను కోరాడు. కాగా నిన్న సాయంత్రం కాలేజీలో జరిగిన ఘటనపై తాజాగా ఫరాన్ స్పందించాడు . ఇద్దరు విద్యార్థులు ఓ అమ్మయితో మిస్ బిహేవ్ చేసారని అడ్డుకోబోయినందుకు..తనతో దురుసుగా ప్రవర్తించారని అన్నాడు . ఈ విషయంపై కాలేజి యాజమాన్యం కలగజేసుకుని సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా దురుసుగా ప్రవర్తించిన వారిని మందలించిందని అన్నాడు.

ఆ కోపంతోనే తనపై రియాన్ ఫిర్యాదు చేసాడని తాను ఎవరినీ ఇప్పటివరకు ర్యాగింగ్ చేయలేదని అన్నాడు. అంతే కాకుండా ఎవరినీ కొట్టలేదని చెప్పాడు. తన తాత హోమ్ మంత్రి అని తానెప్పుడూ.. ఎక్కడా మిస్ బిహేవ్ చేయలేదని చెప్పాడు . కేవలం ఎమ్మెల్సి ఎన్నికల కోసమే చిన్న తప్పును పెద్దగా చూపిస్తున్నారని అన్నాడు. ఒకవేళ ఈ కేసులో తన తప్పు ఏమైనా ఉంటే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని చెప్పాడు. గొడవలు పెట్టుకునే సంస్కృతి తనది కాదని ఫర్హాన్ అన్నాడు. ఇదిలా ఉండగా ఫర్హాన్ హోమ్ మంత్రి మనవడు కావడంతో ఈ గొడవ చర్చగా మారింది. అయితే ఈ కేసులో ఫర్హాన్ తప్పు ఏమైనా ఉందా ..? లేదంటే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోనే చిన్న గొడవకు పెద్దగా చేస్తున్నారా అన్నది పోలీసుల విచారణ అనంతరం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: