సాధారణం గా ప్రతి మనిషికి చెమటలు రావడం సర్వసాధారణం అన్న విషయం తెలిసిందే.  వేగంగా ఏదైనా పని చేస్తున్నా..  లేదా ఉక్క పోసినప్పుడు ..  చెమటలు పడుతుంటాయి. అయితే నిపుణులు చెబుతున్న దాని ప్రకారం చూస్తే చెమటలు రావడం ఎంతో మంచిది అని చెబుతూ ఉంటారు. చెమటలు రావడం వల్ల..  చర్మంపై ఉన్న మలినాలు కూడా తొలగి పోతాయి అని చెబుతూ ఉంటారు నిపుణులు.  అయితే సాధారణంగా చెమటలు రావడం మంచిదే కానీ అతిగా చెమటలూ  వస్తే మాత్రం చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు.



 కొన్ని కొన్ని సార్లు కొంతమంది ఒత్తిడికి లోనయినప్పుడు ఎక్కువగా చెమట లు వస్తూ ఉంటాయి. అదే సమయంలో.. చంకలు  పాదాలు అరచేతుల్లో ఎక్కువగా చెమటలతో వచ్చి  ఎంతగానో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదే సమయంలో ఇక వేసుకున్న డ్రెస్ తడిసిపోవడం ఇబ్బందికరంగా ఉండడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా చెమటలు రాకుండా ఉండడానికి పలు రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ రోజు రోజుకు చెమటలు పట్టడం ఎక్కువ అవుతూ ఉండడంతో ఇక చుట్టూ జనాలు ఉన్న సమయంలో ఇబ్బందులు పడుతూ వుంటారు చాలామంది.



 అయితే ఇలా చెమటలు పడుతున్న సమయం లో వాటిని నివారించేందుకు మళ్ళీ రాకుండా చేసేందుకు చల్లటి బ్లాక్ టీలో మెత్తటి గుడ్డ ముంచి తుడవాలి. బ్లాక్ టీ లో 20 నిమిషాల పాటు చేతులు పెట్టిన  కూడా ప్రయోజనం ఉంటుంది. నీటిలో గంధం వేసి దానిని బాగా కలిపి ఇక ఆ పేస్ట్ శరీరానికి రాసుకుంటే కూడా ఎంతో ప్రయోజనం ఉంటుందట. అలోవెరా జెల్ రాసుకున్న కూడా ఎంతో ఉపశమనం కలుగుతుందట. అదేసమయంలో అధిక కారం బాగా వేడిగా ఉండే వస్తువులు తినటం తగ్గించడం వల్ల ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది అని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: