ప్రైమరీ స్థాయిలోనే పిల్లల నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. అందువల్ల ప్రీ ప్రైమరీ కేంద్రాలను ఆదర్శ వంతంగా తీర్చిదిద్దాలనేది సూచన కూడా ఉన్నది. ఇదే విధంగా అందరికీ ఒకే రకమైన విద్యా విధానం ఉండాలనే సూచనను కూడా పరిగణనలోకి తీసుకోవాలె. తెలంగాణవాదులు సర్వేలు జరిపి గణాంకాలు వెల్లడించడానికే పరిమితం కావడం లేదు. ఇక్కడి సమాజాన్ని స్వయంగా పరిశీలించి తమ అభిప్రాయాలను, సూచనలను వెలిబుచ్చుతున్నారు. మన ప్రభుత్వానికి ఉన్న వనరులలోనే ఇక్కడి విద్యా రంగాన్ని ఎట్లా తీర్చిదిద్దాలనే వీరి సూచనలు ఆచరణ సాధ్యమైనవి. విద్యా స్థాయి వార్షిక నివేదిక (ఆసెర్) మన బడి చదవులు ఎట్లా ఉన్నాయో మరోసారి వెల్లడించింది. దేశ వ్యాప్తంగా చూసినా, మన రాష్ట్రంలో పరిశీలించి నా బడికి వెళ్ళే పిల్లల సంఖ్య పెరిగింది. కానీ నాణ్యత మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నది. సర్కారు బడులు సన్నగిల్లిపోతుంటే ప్రైవేటు స్కూళ్ళు బలపడుతున్నాయి. ఈ నివేదికలో ఏపీని కూడా కలిపి ఒకే రాష్ట్రంగా లెక్కించినా, విడిగా తెలంగాణ పరిస్థితి మెరుగ్గా లేదని నిస్సంకోచంగా చెప్పవచ్చు. ప్రత్యేకిం చి గ్రామాలలోని బడులలో పిల్లలు ఇంగ్లీషు, లెక్కలలో బలహీనంగా ఉన్నారు. ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ప్రమాణాలు పరిశీలిస్తే, దాదాపు ఏడు శాతం విద్యార్థులకు తొమ్మిది వరకు అంకెలు కూడా రావు.18.7 శాతం విద్యార్థులు అక్షరాలే తప్ప పదాలు చదువలేరు. పదాలే తప్ప వాక్యాలు చదువలేని విద్యార్థులు 23 శాతం ఉన్నారు. వసతుల విషయానికి వస్తే- 28.4 పాఠశాలల్లో బాలికలకు పారిశుధ్య వసతి లేదు. పదహారు శాతం పాఠశాలల్లో మంచినీటి వసతి లేదు. 65 శాతం పాఠశాలలకు ఆట స్థలాలున్నాయి. 2006లో ప్రైవేటు పాఠశాలల్లో చేరిన బాలుర సంఖ్య 20.5 శాతం ఉంటే 2014 నాటికి 43.2 శాతానికి పెరిగింది. ఇదే బాలికల సంఖ్య 16.5 నుంచి 29.9 శాతానికి చేరింది. ఐదవ తరగతి పిల్లల్లో- రెండవ తరగతి పాఠం చదవగలిగే వారి సంఖ్య ప్రభుత్వ పాఠశాలల్లో 55.9 శాతం ఉండగా, ప్రైవేటు పాఠశాలల్లో 57.1 శాతం ఉన్నది. భాగహారం చేయగలిగే వారి సంఖ్య ప్రభుత్వ పాఠశాలల్లో 35.1 శాతం ఉండగా, ప్రైవేటు పాఠశాలల్లో 38.4 శాతం ఉన్నది. సర్కా రు బడులతో పోలిస్తే ప్రైవేటు బడులు మెరుగ్గా ఉన్నప్పటికీ స్థూలంగా పరిశీలిస్తే ప్రైవేటు పాఠశాలల్లో బోధించే విద్య కూడా నాణ్యమైనది కాదని స్పష్టమవుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతోనే విద్యారంగంపై చర్చలు మొదలుకావడం సంతోషించవలసిన విషయం. ప్రైవేటు పాఠశాలల్లో మెరుగైన విద్య బోధిస్తున్నట్టు కనిపిస్తున్నప్పటికీ నాణ్యమైన విద్య అందించడం లేదని తెలంగాణవాదు లు అంటున్నారు. పల్లెలకు, తండాలకు కూడా ప్రైవేటు స్కూలు బస్సులు పోతున్నాయి. తమ కూలీనాలీ చేసే తల్లిదండ్రులు కష్టపడి ఫీజులు కడుతున్నారు. తమ పిల్లలు స్కూల్ డ్రెస్, బూట్లు వేసుకుని, టై కట్టుకొని బై చెబుతూ బస్సెక్కిపో పోతుంటే తల్లిదండ్రులు పట్టలేని ఆనందం పొందుతున్నారు. కానీ కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు కాదు కదా కనీసం కళాశాల మెట్లు ఎక్కని వారు పాఠాలు చెబుతున్నారు. తమ పిల్లలు బడి స్థాయిలో కష్టంగా గట్టెక్కినా ఉన్నత విద్యలో రాణించలేరనేది పాపం ఆ తల్లిదండ్రులకు తెలువదు. తాము ఎంత కష్టపడ్డా తమ పిల్లలు చదువుకొని సుఖపడాలనే ఉద్దేశంతో పేదలు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారే కానీ, వారికి డబ్బు ఉండి కాదు. నగరాల్లోని కొన్ని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులపై హింస సాగుతున్నా, తమ ర్యాంకుల విషయమై తప్పుడు ప్రచారం సాగిస్తున్నా ప్రైవేటు సంస్థలపై గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అందుకని ప్రైవేటు పాఠశాలలను నియంత్రిస్తూ, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని తెలంగాణవాదులు కోరుతున్నారు. మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం ప్రవేశ పెట్టడం అద్భుత ఫలితాలను ఇస్తున్నది. ఇటువంటి ప్రోత్సాహకాలతో పాటు బోధనా రంగంపై దృష్టి సారిస్తే ప్రభుత్వ పాఠశాలలు బలపడుతాయి. ప్రీ ప్రైమరీ స్థాయిలోనే పిల్లల నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. అందువల్ల ప్రీ ప్రైమరీ కేంద్రాలను ఆదర్శ వంతంగా తీర్చిదిద్దాలనేది సూచన కూడా ఉన్నది. ఇదే విధంగా అందరికీ ఒకే రకమైన విద్యా విధానం ఉండాలనే సూచనను కూడా పరిగణనలోకి తీసుకోవాలె. తెలంగాణవాదులు సర్వేలు జరిపి గణాంకాలు వెల్లడించడానికే పరిమితం కావడం లేదు. ఇక్కడి సమాజాన్ని స్వయంగా పరిశీలించి తమ అభిప్రాయాలను, సూచనలను వెలిబుచ్చుతున్నారు. మన ప్రభుత్వానికి ఉన్న వనరులలోనే ఇక్కడి విద్యా రంగాన్ని ఎట్లా తీర్చిదిద్దాలనే వీరి సూచనలు ఆచరణ సాధ్యమైనవి. మన రాష్ట్రంలో విద్యావిధానాన్ని అత్యుత్తమమైందిగా తీర్చిదిద్దడమే అందరి లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విద్యా విధానంపై సాగే చర్చలో అన్ని వర్గాలను భాగస్వాములను చేయాలని భావిస్తున్నది. ఇందులో భాగంగా ఈ నెల 27న విస్తృతస్థాయిలో విద్యా సదస్సు నిర్వహిస్తున్నది. వివిధ వేదికలపై చర్చించి విద్యా విధానాన్ని రూపొందించడం ఒక ఎత్తయితే, దానిని విజయవంతంగా అమలు చేయడం మరో ఎత్తు. ఉపాధ్యాయులది ఇందులో ప్రధాన పాత్ర. ప్రభు త్వం, తెలంగాణవాదులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు- అంతా కలిసి ప్రతి తెలంగాణ బిడ్డ ఉన్నత స్థాయికి ఎదగడానికి కృషి సాగించాలె.

మరింత సమాచారం తెలుసుకోండి: