అయితే ఒకప్పుడు ఇలా జగన్కు అండగా ఉన్న వివేకా కూతురు ఇప్పుడు మాత్రం జగన్ తో అంతగా రాపో మెయింటెన్ చేయడం లేదు అన్నది అర్థం అవుతుంది. ఈ క్రమంలోనే ఇక షర్మిలకు ఎక్కువగా సన్నిహితంగా ఉండడమే కాదు ఇక మద్దతు కూడా తెలిపేందుకు వివేకా కూతురు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వివేకానంద రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో వివేకానంద రెడ్డి కూతురు తో పాటు షర్మిల కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొనక పోవడం గమనార్హం. ఇది ప్రస్తుతం అటు ఆంధ్ర తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోయింది అని అంటున్నారు విశ్లేషకులు.
అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త పార్టీని ప్రారంభించి ఇక తెలంగాణ రాష్ట్రంలో క్రియాశీలక రాజకీయ నేతగా ఎదగాలని అనుకుంటున్న షర్మిలకు ఇక ఇప్పుడు ఏకంగా సొంత ఫ్యామిలీ నుంచి సపోర్ట్ వస్తూ ఉండటంతో ప్రస్తుతం జగన్ కు భారీ షాక్ తగిలింది అని అంటున్నారు విశ్లేషకులు. మరి ఇక వివేకానంద కూతురు సునీత షర్మిలకు సపోర్ట్ చేస్తూ ఉండడంతో ఇక షర్మిల రానున్న రోజుల్లో ఎలాంటి ముందడుగు వేయబోతుంది అన్నది కూడా ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి