భారత్ ప్రపంచంలోనే బలమైన శక్తిగా ఎదుగుతోంది. అనేక రంగాల్లో అగ్రస్థానానికి దూసుకుపోతోంది. త్వరలోనే భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానానికి చేరుతుందని అంచనా ఉంది. ఇటీవల భారత్ కరోనా వ్యాక్సీన్ల రంగంలో అగ్ర రాజ్యాలకు దీటుగా టీకాలు ఉత్పత్తి చేసింది. దాదాపు 150 దేశాలకు టీకాలు పంపిణీ చేసింది. ఇక ఇప్పుడు ఇండియా ఖ్యాతి మరోసారి రుజువైంది. అదేంటంటే.. ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక శక్తి ఉన్న దేశాల్లో ఇండియా నాలుగో స్థానం దక్కించుకుంది.

చైనా, అమెరికా, రష్యా తర్వాత స్థానంలో ఇండియానే ఉంది. పైగా ఆ మూడు దేశాలు ప్రపంచ అగ్ర రాజ్యాలుగా కొనసాగుతున్నాయి. వాటి తర్వాత స్థానం ఇండియాదే కావడం గొప్ప విషయమే. ఇంతకీ ఈ విషయం చెప్పిందెవరంటే.. మిలిటరీ డైరెక్ట్ అనే వెబ్ సైట్ ఈ విషయాన్ని ప్రకటించింది.   ప్రపంచంలోనే అత్యంత బలమైన సైనిక శక్తి చైనా వద్ద ఉందని ఈ మిలటరీ డైరెక్ట్‌’ వెబ్‌సైట్‌  చెబుతోంది.  ఈ లిస్టులో జాబితాలో భారత్‌ నాలుగో స్థానంలో ఉందని తాజాగా విడుదల చేసిన ఒక అధ్యయన నివేదికలో తెలిపింది.

ఇక ఈ జాబితాలో అమెరికా రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో రష్యా నిలిచింది. ఇండియాకు నాలుగో ప్లేస్ దక్కితే..  ఫ్రాన్స్‌కు ఐదు, బ్రిటన్‌కు 9వ స్థానాలు దక్కాయి. స్థానాల రూపంలో కాకుండా అసలు సైనిక శక్తిని పాయంట్లుగా చెబితే.. చైనాకు 82 పాయింట్లు దక్కాయి. ఆ తర్వాత స్థానంలో ఉన్న  అమెరికాకు 74 పాయింట్లు దక్కాయి. మూడో స్థానంలో ఉన్న  రష్యాకు 69 పాయింట్లు దక్కాయి. నాలుగో స్థానంలోని భారత్‌కు 61 పాయింట్లు వచ్చాయి.

ఇక ఫ్రాన్స్‌కు 58, బ్రిటన్‌కు 43 పాయింట్లు లభించాయని మిలిటరీ డైరెక్ట్ వెబ్ సైట్ వెల్లడించింది. రక్షణ బడ్జెట్లు, క్రియాశీల, రిజర్వు బలగాల సంఖ్య, వైమానిక, నౌకా శక్తి, అణ్వస్త్రాలు వంటి అంశాల ఆధారంగా సైనిక సామర్థ్యాన్ని లెక్కించారట. ఇండియాకు నాలుగో ప్లేస్ దక్కడం శుభవార్తలాగానే కనిపిస్తున్నా.. మన పక్కనే ఉన్న చైనాకు ఫస్ట్ ప్లేస్ దక్కడం ఓ విధంగా డేంజర్‌ సిగ్నలే.. ఏమంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: