దేశంలో కరోనా వైరస్ కేసులు సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది అన్న విషయం తెలిసిందే.  మొన్నటి వరకు కొన్ని రాష్ట్రాల్లో  వైరస్ పూర్తిగా తగ్గిపోయింది అని ఆయా రాష్ట్ర ప్రజలు మొత్తం ఊపిరిపీల్చుకున్నారు. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు మరోసారి పెరిగిపోతున్న నేపథ్యంలో అందరూ బెంబేలెత్తిపోతున్నారు అనే చెప్పాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటి వరకు అతి తక్కువ కేసులు నమోదు కాగా ప్రస్తుతం తెరమీదకి వస్తున్న  కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.  గత ఏడాది ఇదే సమయంలో  వైరస్ విజృంభించడంతో  విద్యాసంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోతోంది.


 ఇప్పుడు మరోసారి కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో విద్యాసంస్థలను తెరిచి ఉంచాలా లేక మూసివేయాలనేది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ కేసులు విజృంభిస్తున్నప్పటికీ  పాఠశాలను కొనసాగించడానికి మొగ్గుచూపింది. ఈ క్రమంలోనే  పాఠశాలకు కొనసాగించడం అటు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారిపోతుంది. ఎందుకంటే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య  పెరుగుతూ ఉండటం ముఖ్యంగా పాఠశాలలో కరోనా భారీగా వైరస్ కేసులు వెలుగు లోకి వస్తూ ఉండటం సంచలనంగా  మారిపోతుంది.



 24 గంటల్లో రాష్ట్రంలో 45 మందికి పైగా విద్యార్థులు కరోనా వ్యాధి బారినపడ్డారు గత రెండు రోజుల్లో విజయవాడలోని ఓ స్కూల్లో 10 మంది విద్యార్థులకు కరోనా వైరస్ వచ్చినట్టు తెలుస్తోంది. గుంటూరులో కరోనా వైరస్ బారిన పడిన ఇద్దరు ఉపాధ్యాయులు మృతిచెందిన ఘటన మరింత సంచలనం గా మారిపోయింది. కరోనా వైరస్ టెస్టులు మరింత వేగంగా చేస్తే ఇంకా ఎన్నో కేసులు బయటపడే అవకాశం ఉంది అని కూడా వాదనలు వినిపిస్తున్నాయి అయితే ఓ వైపు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలను కొనసాగించడానికే మొగ్గు చూపుతుండటం విద్యార్థులను  విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళనలో ముంచెత్తుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: