తెలంగాణలో కరోనా కేసుల దెబ్బకి ఇప్పుడు అందరూ కూడా భయపడిపోయే పరిస్థితి ఏర్పడింది. రోజురోజుకీ కరోనా కేసులు భారీగా పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలావరకు జాగ్రత్తగానే చర్యలు తీసుకుంటుంది. అయినా సరే తెలంగాణలో కరోనా కేసులు  నమోదు కావడం ఆగడం లేదు. దాదాపుగా అన్ని జిల్లాలో కరోనా కేసులు వేగంగా పెరగడం తో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన అధికారి సోమేష్ కుమార్ చాలా జాగ్రత్తగా చర్యలు చేపడుతున్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ కొన్ని సూచనలు సలహాలు ఇస్తున్నారు.

తెలంగాణలో కరోనా కేసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సమర్థవంతంగా చర్యలు చేపడుతున్నది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా కేసులు కట్టడి కాకపోతే వృద్ధులకు అదే విధంగా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు కరోనా చర్యలు చేపడుతుంది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం ఇప్పుడు కాస్త కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ముషీరాబాద్ లో కరోనా వైరస్ కట్టడికి నడుం బిగించిన కాలనీ వాసులు... తమ వంతుగా చర్యలు చేపట్టారు.

ముషీరాబాద్ లోని బోలక్ పూర్ డివిజన్ పద్మశాలీ కాలనీ వెల్ఫేర్ సొసైటీలోని ప్రతి ఇంటికి బ్యానర్ ఏర్పాటు చేసారు. దయచేసి మా ఇంటికి రాకండి.. మీ ఇంటికి రానియ్యకండని బ్యానర్ పై పేర్కొన్న కాలనీ వాసులు... కరోనా సెకండ్ వేవ్ ను కలసికట్టుగా ఎదుర్కోవాలని కాలనీ వాసులు తీర్మానం చేసారు. రానున్న మూడు నాలుగు నెలల పాటు బంధువుల సహా.‌. ఎవర్నీ తమ‌ ఇంట్లోకి అడుగు పెట్టనీయమని కాలనీ వాసులు అంటున్నారు. బంధువులు ఫోన్లు చేసి తమ కాన్సెప్ట్ ను అభినందిస్తున్నారని మహిళలు వెల్లడించారు. కరోనా నేపథ్యంలో బార్లు, రెస్టారెంట్లను సైతం మూసివేయాలని ప్రభుత్వానికి డిమాండ్‌ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: