దీంతో అయినా వాళ్ళు దూరం పెట్టడంతో కనీసం అంత్యక్రియలు కూడా జరగని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ఎంతో మంది మున్సిపల్ సిబ్బంది స్వయంగా అంత్యక్రియలు నిర్వహించే ఘటనలు కూడా వస్తున్నాయి. ఇలా ఎన్నో హృదయ విదారక ఘటనలతో కరోనా వైరస్ అంటే మరింత భయాన్ని పెంచే విధంగా ఉన్నాయి ఇక్కడ ఇలాంటి ఒక విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. అతను ఒక పాత్రికేయుడు ఇక తన విధి నిర్వహణలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలిచాడు. తన రాతలతో ఎంతోమంది లో ధైర్యం నింపాడు. కానీ చివరికి కరోనా అతని పై పగ బట్టి మరి చంపేసింది.
ఉట్నూర్ కి చెందిన పాత్రికేయుడు గాజుల విజయ్ ఇటీవలే వైరస్ బారినపడి రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఆయనకు సంతానం లేరు. దీంతో భార్య ఒక భర్త శవాన్ని ఆస్పత్రి నుంచి ఉట్నూర్ లోని స్మశాన వాటికకు తీసుకువచ్చింది. అయితే ఆయనకు కనీసం గోతి తవ్వెందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు ఆ మహిళ గుండెలు పగిలేలా ఏడుస్తూ అందరినీ వేడుకున్న.. ఎవరి మనసు కరగలేదు. ఈ క్రమంలోనే కొంతమంది సామాజిక కార్యకర్తలు స్పందించి గోతి తవ్వించి అంత్యక్రియలు జరిపించారు. ఈ ఘటన స్థానికంగా అందరినీ కలచివేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి