ఇలా పరీక్షలు చేసుకున్న తర్వాత వారికి పాజిటివ్ వచ్చింది అంటే ఇక హోం ఐసోలేషన్ లో ఉంటూ తగిన జాగ్రత్తలు చికిత్స పొందుతున్నారు. ఇలాంటి వాళ్ళతో ఎలాంటి ప్రాబ్లం లేదు.. కానీ ఎంతో మందిలో లక్షణాలు కనిపించక పోవడం తో వారి లో కరోనా వైరస్ లేదు అని భావించి ఇక జనసమూహంలో ఎప్పటిలాగానే తిరుగుతున్నారు. వీరి కారణంగా ఎంతోమంది కరోనా వ్యాధి బారిన పడుతున్నారు. తెలంగాణలో భారీగా కేసులు పెరిగిపోవడానికి ఇదే ప్రధాన కారణం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
సరి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి తిరిగి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం 11600 బృందాలను ఏర్పాటు చేసింది వీరందరూ ఇంటింటికి తిరిగి కరోనావైరస్ అనుమానం ఉన్న వారికి ఇంటివద్ద పరీక్షలు నిర్వహించనున్నారు ఒకవేళ ఆరోగ్య పరిస్థితి విషమిస్తే వెంటనే ఆస్పత్రికి తరలించనున్నారు. ప్రతి ఇంటికి తిరిగి కుటుంబంలో ఆరోగ్యం ఎలా ఉంది అనే దానిపై వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి