చైనాలో వెలుగులోకి వచ్చిన మహమ్మారి కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం చుట్టేస్తుంది. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా అన్ని దేశాలలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులు అదుపులో కి వచ్చినట్లు అనిపించినప్పటికీ అంతలోనే మళ్ళీ  వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో పరిస్థితులు మరింత అధ్వానంగా మారిపోతున్నాయి. రోజురోజుకు దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కరోనా వైరస్ పేరెత్తితే చాలు బెంబేలెత్తి పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  అయితే గత ఏడాది కరోనా వైరస్ వెలుగులోకి రాగానే ఈ మహమ్మారి వైరస్ ను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ తయారీకి సిద్ధమయ్యాయి పలు దేశాలు .


 ఈ క్రమంలోనే ఇప్పటికే పలు దేశాలు తమ దేశంలో ఒక వ్యాక్సిన్ అభివృద్ధి చేయడమే కాదు అత్యవసర వినియోగం కోసం కూడా ఉపయోగిస్తున్నాయ్. కొన్ని రకాల వ్యాక్సిన్ లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఫైజర్,ఆస్ట్రాజేనిక, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, జాన్సన్ అండ్ జాన్సన్, మోడర్న లాంటి టీకాలు అత్యవసర వినియోగం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందాయి.  ఇప్పుడు కూడా మరో వ్యాక్సిన్ ఆమోదం పొందినట్లు తెలుస్తోంది.



 చైనాకు సంబంధించినటువంటి సినోఫిర్ వ్యాక్సిన్ను ఇటీవలే అత్యవసర వినియోగం కోసం ఆమోద ముద్ర వేస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన క్లినికల్ ట్రయల్స్ లో 79%  టీకా సమర్థవంతంగా పనిచేస్తుంది అన్న విషయం తేలింది. కరోనా వైరస్ మహమ్మారి కి వ్యతిరేకంగా అటు వాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా ఈ వ్యాక్సిన్ కు అత్యవసర వినియోగం కోసం అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. 18 ఏళ్ళ వయస్సు నిండిన వారికి ఈ వ్యాక్సిన్ వేసేందుకు సిఫార్సు చేస్తోంది సంస్థ. అయితే 60 ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా ప్రభావం చూపడం లేదని అందుకే అలాంటి వారికి వ్యాక్సిన్ ఇవ్వడానికి సిఫార్సు చేయడం లేదు అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.  అయితే చైనా కు సంబంధించిన వ్యాక్సిన్ కు అత్యవసర వినియోగం కోసం అనుమతులు వచ్చినప్పటికీ ఈ వ్యాక్సిన్ పై మొత్తం ప్రపంచ దేశాలు అనుమానం వ్యక్తం చేస్తూన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: