ఇక దేశంలో కరోనా ఉధృతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక రోజు రోజుకి చాప కింద నీరు లాగా కరోనా దేశం నలుమూలాల వ్యాప్తి చెందుతుంది. ఇక దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా తాజాగా నమోదైన మొత్తం కేసుల్లో అత్యధిక కేసులు ఈ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు కరోనా కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్రను కర్ణాటక అధిగమించింది. సోమవారం ఒక్కరోజే రాష్ట్రంలో దాదాపు 40వేల మంది వైరస్‌ బారినపడటం వైరస్‌ ఉద్థృతికి అద్ధం పడుతోంది.

24 గంటల గ్యాప్ లోనే దేశవ్యాప్తంగా 3.29లక్షల కొత్త కేసులు బయటపడగా.. అత్యధికంగా కర్ణాటకలో 39,305 మందికి వైరస్‌ సోకింది. ఇక 37,236 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. తాజా కేసులతో కర్ణాటకలో ఇప్పటివరకు 19.73లక్షల మంది కరోనా బారినపడ్డారు. ఇక నిన్న ఒక్కరోజే ఆ రాష్ట్రంలో 596 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు.

కేవలం ఒక్క రోజులో ఇంత ఎక్కువ మంది చనిపోవడం రాష్ట్రంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంతేగాక, మహారాష్ట్ర తర్వాత 500లకు పైగా రోజువారీ మరణాలు నమోదైన రెండో రాష్ట్రం కూడా ఇదే.

ఒక్క బెంగళూరు సిటీలోనే నిన్న 16,747 కేసులు నమోదవ్వగా.. 374 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,67,6409  కేసులు నమోదయ్యాయి. వైరస్‌ ఉద్ధృతి దృష్ట్యా సోమవారం నుంచి అక్కడ లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. 15 రోజుల పాటు ఈ ఆంక్షలు కొనసాగుతాయి.ఇక దేశవ్యాప్తంగా నమోదైన కొత్త కేసుల్లో దాదాపు సగం 46.76శాతం కేసులు కేవలం ఐదు రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. కర్ణాటక, మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా తమిళనాడులో 28,978, కేరళలో 27,487, ఉత్తరప్రదేశ్‌లో 21,277 కేసులు ఉన్నాయి. ప్రజలంతా లాక్‌డౌన్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప వేడుకున్నారు.కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మాస్కులు తప్పనిసరిగా ధరించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: