గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కరోనా కేసులు మాత్రం ఆగడం లేదు. గతంలో కరోనా కేసులు గ్రామీణ ప్రాంతాలకు పెద్దగా వెళ్లిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు మాత్రం కరోనా కేసులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతా ల్లో నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. వైద్య సదుపాయాలు అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు కూడా ఎక్కువగానే వినబడుతున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు కాస్త ఆందోళన కలిగిస్తున్నాయని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వాలు సమర్థవంతంగా వ్యవహరించకపోతే మాత్రం భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయని గ్రామీణ ప్రాంతాల్లో ప్రాణనష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వైద్య సేవలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ కొంతమంది విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగుపరచుకోవడమే కాకుండా అక్కడ ఉన్న అంగన్వాడీ అదేవిధంగా వాలంటీర్ల ద్వారా చాలావరకు చర్యలు చేపట్టాలి అని కొంత మంది కోరుతున్నారు.

దీనికి సంబంధించి నిపుణులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మందులను ఎక్కువగా సరఫరా చేయాలని అదేవిధంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం విషయంలో కూడా గ్రామీణ ప్రాంతాల మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అని కొంతమంది కోరుతున్నారు. లేకపోతే మాత్రం ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు దీని మీద దృష్టి పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. మరి ఈ అంశానికి సంబంధించి ఏ విధంగా ముందడుగు పడుతుంది ఏంటి అనేది చూడాలి. గ్రామీణ ప్రాంతాల్లో కేసులో అదుపులోకి రాకపోతే కేంద్రం కూడా చర్యలకు దిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: