కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులూ తీసుకోవాల‌ని, అప్పుడే వైర‌స్‌ను పూర్తిస్థాయిలో నిరోధించ‌డానికి అవ‌కాశం ఉంటుంద‌ని వైద్య‌నిపుణులు చెబుతున్నారు. రెండో డోసు వ్యాక్సిన్ వేయించుకున్న త‌ర్వాతే పూర్తివ్యాక్సిన్ వేయించుకున్న‌ట్ల‌వుతుంద‌ని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ స్ప‌ష్టం చేస్తోంది. అయితే, ఈ రెండో డోస్ వ్యాక్సిన్ కు అంత ప్రాముఖ్య‌త ఎందుకు? అంటే శ‌రీరంలో వ్యాధినిరోధ‌క‌శ‌క్తిని ప్రేరేపించేలా పెద్ద‌సంఖ్య‌లో యాంటీ బాడీస్ ను విడుద‌లయ్యేలా చేస్తుంది. మొద‌టి డోస్ కొవిడ్-19తో పోరాడడానికి సిద్ధం చేస్తుంది. రెండో డోస్ నుంచి సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ లభిస్తుంది.

మెమ‌రీసెల్స్ ను స్టిమ్యులేట్ చేస్తుంది
రెండో డోసు వ్యాక్సిన్ మెమరీ సెల్స్ ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ సెల్స్ ఇంజెక్షన్ ని చాలాకాలం పాటు గుర్తుపెట్టుకుని మళ్ళీ ఇన్‌ఫెక్షన్ వస్తే వెంటనే యాంటీ బాడీస్ ని ప్రొడ్యూస్ చేయడం లో స‌హాయ‌ప‌డ‌తాయి. అందుకే వ్యాక్సిన్ రెండు డోసులూ అవసరం, అప్పుడే ఈ మ‌హ‌మ్మారి నుంచి పూర్తిస్థాయి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. రెండు డోసులు తీసుకున్న త‌ర్వాత సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష న్ కొన్ని అంశాలు సూచించింది. అవేంటంటే.. ఏ వయసువారైనా సరే పూర్తిగా వ్యాక్సిన్ వేయించుకున్నవారితో, అంటే రెండు డోసుల‌ వ్యాక్సిన్ తీసుకున్నవారితో, మాస్క్ లేకుండా ఇంట్లో కానీ, బ‌య‌ట కానీ  కొంత సేపు గడపవచ్చు. అలాగే వ్యాక్సిన్ వేయించుకోని, కానీ ఎలాంటి సీరియస్ వ్యాధుల రిస్క్ లేని ఒక ఇంటి వారితో మాస్క్ లేకుండా ఇంట్లో కానీ, బ‌య‌ట‌కానీ కొంత స‌మ‌యం గడపవచ్చు. పెద్ద సంఖ్యలో గుమిగూడిన ప్రదేశాలకి దూరంగా ఉండడం మంచిద‌ని చెబుతోంది.

అపోహ‌ల‌కు దూరంగా ఉండాలి!
వ్యాక్సిన్ రెండోడోసు తీసుకోవ‌డాన్ని చాలామంది ఉద్దేశ‌పూర్వ‌కంగా జాప్యం చేస్తుండ‌టం స‌రికాద‌ని.. వ్యాక్సిన్‌పై సోష‌ల్ మీడియాలో వ‌స్తోన్న వార్త‌ల‌ను దూరం పెట్టాల‌ని, వాస్త‌వ విరుద్ధంగా ఉండే అటువంటి వార్త‌ల‌ను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని సూచిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: