రాజకీయాల్లో ఎన్నో దారులు. లక్ష్యాన్ని చేరుకోవాలి అని అనుకోవాలే కానీ ఏ దారి అయినా ఎంచుకోవచ్చు. అయితే దానిని రాదారిగా మార్చుకోవడంలోనే నాయకుడి సత్తా అన్నది ఆధారపడి ఉంటుంది. ఇక దేశంలో రాజకీయాలు మారుతున్నాయి. అలాగే ఏపీలో కూడా రాజకీయం మారుతోంది.

చంద్రబాబు టీడీపీ ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయకూడదు అని కచ్చితమైన నిర్ణయం తీసుకుంది. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన దానికి భారీ మూల్యమే ఆ పార్టీ చెల్లించింది. దాంతో బీజేపీ తోనే ఈసారి వెళ్లాలని టీడీపీ ఆలోచిస్తోంది. అంటే 2014 నాటి పొలిటికల్ కాంబోను రిపీట్ చేయడం అన్న మాట. అటు మోడీ, ఇటు పవన్ ని పెట్టుకుని 2024 ఎన్నికల్లో జగన్ని గట్టిగా ఎదుర్కోవాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు.

అయితే బీజేపీ మాత్రం ససేమిరా తాము చంద్రబాబు తో కలిసేది లేదు అంటోంది. ఏపీ బీజేపీ నేతలు ఈ విషయంలో గట్టి పట్టుదలగా ఉన్నారు. అయితే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ సమయం ఉంది. దాంతో ఇప్పటి మాటలు ఏవీ అపుడు ఉండవని కూడా అందరికీ తెలుసు. ఆ ధీమాతోనే టీడీపీ కూడా ఉంది. అయితే ఒకే ఆలోచనతో ఉండకుండా ప్లాన్ బీని కూడా చంద్రబాబు రెడీ చేసి పెట్టుకున్నారు అంటున్నారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా బాబుతో బీజేపీ దోస్తీ కట్టకపోతే కాంగ్రెస్ తోనైనా కలసి వెళ్లాలని కూడా టీడీపీ ఆలోచిస్తోంది అంటున్నారు.

దేశంలో కాంగ్రెస్ మళ్లీ బలం పుంజుకుంటే అది జరగడం అసాధ్యమని కూడా ఎవరూ అనుకోరు. దేశంలో మోడీకి ఆల్టర్నేషన్ కూటమికి ఏర్పాటు చేసేందుకు ప్రశాంత్ కిశోర్ ఎటూ గట్టిగా ట్రై చేస్తున్నారు. దాంతో కాంగ్రెస్ పొడ గిట్టని జగన్ ఒక వైపు ఉంటే కచ్చితంగా చంద్రబాబే ఏపీలో ఆ కూటమికి నాయకత్వం వహిస్తారు అంటున్నారు. అదే విధంగా కమ్యూనిస్టులను కూడా కలుపుకుని ముందుకు పోతే బలమైన కూటమి అవుతుంది అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే అటూ ఇటూ రెండు జాతీయ పార్టీలు ఉండగా టీడీపీ మాత్రం తనదైన వ్యూహంతోనే ముందుకు సాగుతుంది అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: