గత ఏడాది చైనాలో వెలుగులోకి వచ్చి ఇప్పటి వరకు ప్రపంచాన్ని మొత్తం పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ కు సంబంధించిన అసలు నిజాలు తెలుసుకునేందుకు ప్రపంచ దేశాల నుంచి ప్రస్తుతం ఒత్తిడి ఎంతగానో ఎక్కువవుతుంది.  ప్రపంచం మొత్తం ఇంతటి ఘోరమైన సంక్షోభం ఎదుర్కోవడానికి అసలు కారకులు ఎవరో విచారణ జరపాలంటూ డిమాండ్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.  ఇలాంటి తరుణంలో అటు చైనా వ్యవహరిస్తున్న తీరు ఎంతో అనుమానాస్పదంగా మారిపోతుంది. ప్రపంచం దృష్టిని మరల్చేందుకు చైనా ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ముఖ్యంగా ఇటీవలే జీ 7 దేశాలను టార్గెట్ చేస్తూ ఏకంగా వార్నింగ్ ఇచ్చింది చైనా.



 కూటములుగా ఏర్పడిన దేశాలు ప్రపంచాన్ని శాసించే కాలం ఎప్పుడో పోయింది అంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసింది చైనా. చైనా వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం నిజంగానే అందరూ అనుకుంటున్నట్లుగా కరోనా వైరస్ ఊహన్ ల్యాబ్ లోనే పుట్టింది అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. కరోనా వైరస్ అసలు నిజాలను తెలుసుకునేందుకు జి 7 సదస్సులో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో డ్రాగన్ దేశం చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయాయ్.



 ఇటీవల జీ7 సదస్సులో భాగంగా అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. రానున్న రోజుల్లో చైనా నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలి అంటూ అమెరికా వ్యాఖ్యానించింది. అయితే అమెరికా ఈ వ్యాఖ్యలు చేయడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది చైనా.  జి 7 కూటమిని ఉద్దేశిస్తూ.. చిన్న కూటములు ప్రపంచాన్ని భయపెట్టే రోజులు ఎప్పుడో పోయాయి అని ప్రపంచంలోని అన్ని దేశాల తో సంప్రదింపులు జరిపిన తర్వాతనే ఒక నిర్ణయానికి రావాలి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది డ్రాగన్ కంట్రీ. అయితే ఊహన్ లో కరోనా వైరస్  పుట్టలేదు అని చెబుతున్న చైనా..  జీ7 సదస్సులో ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నది అప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: