ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ కాస్త అదుపులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే భారతదేశంలో థర్డ్ వేవ్ పిల్లల మీద ఎక్కువగా ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఒక శుభవార్త కూడా వెలుగులోకి వచ్చింది. అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం తయారీ దశలో ఉన్న రెండు వ్యాక్సిన్ ట్రైల్స్ పిల్లల మీద అద్భుతమైన ఫలితాలు చూపించాయని సమాచారం. మెడెర్నాతో పాటు ప్రోటీన్-ఆధారిత వ్యాక్సిన్ ట్రయిల్స్ పిల్లలకు కరోనా నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు తేల్చాయి. 


తాజాగా కోతి జాతికి చెందిన ఆఫ్రికన్ లాంగూర్ పిల్లల మీద చేసిన ప్రయోగంలో యాంటీబాడీలు ప్రతిస్పందిస్తున్నట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు వివరాలు అన్నీ సైన్స్ ఇమ్యునాలజీ పత్రికలో తాజాగా ప్రచురించడంతో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ టీకాల ప్రయోగాలు 16 కోతి పిల్లల మీద ఇరవై రెండు వారాల పాటు జరిగాయని అయితే ఈ టీకాలకు సంబంధించి మరిన్ని విషయాలు లోతుగా పరిశీలించేందుకు మరో ఏడాది పాటు ప్రయోగాలు కొనసాగించాలని తెలుస్తోంది. సుమారు రెండున్నర నెలలు వయస్సు ఉన్నకోతి పిల్లలను రెండు జట్లుగా విడదీసి వాటికి వ్యాక్సిన్ ఇవ్వగా నాలుగు వారాల తరువాత వాటిలో ఇమ్యూనిటీపవర్ పెరిగిందని పరిశోధకులు గుర్తించారు. 


అలాగే ప్రతి కోతి పిల్లకు ప్రీ క్లినికల్ మోడర్నా, అలాగే ప్రొటీన్ ఆధారిత వ్యాక్సిన్ ఇవ్వగా ఈ రెండు వ్యాక్సిన్ లు బాగా పని చేస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. అంతా బాగానే ఉన్నా టీ హెల్పర్ టైప్ 2పై ఎలాంటి ప్రభావం చూపలేదని ఆ కారణంగా పిల్లల భద్రతకు హాని కలిగిస్తుందని చెబుతున్నారు. యాంటీబాడీలు ఎదుర్కొని చిన్నపిల్లల అభివృద్ధికి ఆటంకం కలిగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో మరో ఏడాది పాటు ఈ పరిశోధన కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: