
ఇకపై ఆ ఇబ్బంది లేకుండా జగన్ సర్కారు ఇవాళ జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతోంది. సర్కారులోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేసింది. శాఖల వారీగా ఖాళీల నివేదికను ఇప్పటికే జగన్ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇవాళ సీఎం జగన్ ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నారు. శాఖల వారీగా ఉన్న ఖాళీల భర్తీకి సంబంధించిన సమాచారాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి.. ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తారు.
ఇకపై ఏపీలో ఉద్యోగాలను గ్రూప్ 1, 2, 3, 4 కేటగిరీలుగా విభజించి భర్తీ చేస్తారు. ఆర్థిక శాఖ ఆమోదంతో విడతల వారీగా.. ఈ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ ఏడాది రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ అన్నీ కలిపి 10, 143 కొలువులు భర్తీ చేయాలని జగన్ సర్కారు ప్రణాళిక రూపొందించింది. విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి జగన్ సర్కారు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనుంది.
ఈ క్యాలెండర్ వివరాల ప్రకారం జూలైలో 1,238 ఎస్సీ ఎస్టీ డీఏ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నోటీఫికేషన్ ఇస్తారు. ఆగస్టులో ఏపీపీఎస్సీ ద్వారా 36 పోస్టులకు ప్రకటన జారీ చేస్తారు. పోలీస్ శాఖలో 450 పోస్టులకు సెప్టెంబరులో 451 వైద్యులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు అక్టోబరులో ప్రకటన వస్తుంది. నవంబర్‌లో అత్యధికంగా 5,251 మంది పారామెడికల్ సిబ్బంది, డిసెంబరుల 441 మంది నర్సుల నియామకానికి ప్రకటన ఇస్తారు.
వచ్చే ఏడాదిజనవరిలో 240 డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తారు. విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించి ఫిబ్రవరిలో 2 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. వచ్చే మార్చిలో.. వేర్వురు శాఖల ద్వారా మరో 36 ఉద్యోగాలు భర్తీ చేస్తారు.