ఇటీవలి కాలం లో భారత వాయు సేన ఎంతో పటిష్టం గా మారి పోతుంది.  మొన్నటి వరకు దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడిన వాయు సేన ఇక ఇప్పుడు దేశం లో ప్రజల ప్రాణాలు కాపాడటానికి కూడా సిద్ధమ య్యింది.  ఈ క్రమం లోనే ఇక దేశం లో కరోనా క్లిష్ట సమయం లో వేగం గా ఆక్సిజన్ సరఫరా చేసి ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టింది.  ఇక వాయు సేనలో చేరడానికి ఎంతో మంది ముందుగా కఠిన మైన ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు.



 ఇక ఇటీవలే  వాయు సేన చరిత్ర లోనే మొదటి సారిగా 20 వేల ఐదు వందల గంటల ట్రైనింగ్ టైమింగ్ క్యాడెట్లు చేసారు.  తెలంగాణ లోని రంగారెడ్డి జిల్లా దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ లోనే ట్రైనింగ్ క్యాడెట్లు ఇక ఈ ఘనత సాధించారు. అయితే ఆర్మీ చీఫ్ మార్షల్ ఆర్ కె ఎస్ బదౌరియా దీనిపై స్పందిస్తూ అభినందనలు తెలిపారు. కరోనా వైరస్ సమయం లో 3800 గంటలు ఐఏఎఫ్ టీమ్ ప్రయాణించి ఎంతగానో శ్రమించింది అని ఆయన వ్యాఖ్యానించారు.  సరైన సమయానికి ఆక్సిజన్ అందించడం లో టీం కీలక పాత్ర వహించింది అన్నారు.



 ఇక ఇందులో భాగమైన 161 మంది క్యాండెట్ లకు అభినందనలు తెలిపారు ఆయన. ఇక ఈ రోజు నుంచి దేశం కోసం త్యాగం చేయడమే మీ ద్యేయం అంటూ తెలిపారు. ఇక క్యాడేట్లుగా  ఎంపికైన వారి తల్లి దండ్రులు గర్వ పడాలని తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి దేశ చరిత్ర లో వాయు సేన ఎంతో కీలకం గా వ్యవహరిస్తుందని ఏయిర్ ఛీప్ చెప్పుకొచ్చారు. ఇక కొత్త క్యాడెట్ల అందరి ధైర్యసాహసాలకు రానున్న రోజులు పరీక్ష లాంటిది అంటూ తెలిపారు ఆర్మీ చీఫ్ మార్షల్ బదౌరియా .

మరింత సమాచారం తెలుసుకోండి: