తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా రాజకీయాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. కథ మొత్తం ఈటల రాజేందర్ చుట్టూనే తిరుగుతోంది. తెరాస పార్టీకి మరియు హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఎమ్మెల్యే ఉప ఎన్నికకు తెరలేచింది. కాగా రాజేందర్ తన మిగిలిన రాజకీయ భవిష్యత్తును జాతీయ పార్టీ అయిన బీజేపీ తో కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఉప ఎన్నిక ఫైట్ బీజేపీ కి మరియు తెరాస కి మధ్యనే జరగనుంది. ఇప్పటికే తెరాస అధ్యక్షుడు మరియు తెలంగాణ సీఎం తమ మంత్రులకు ఉప ఎన్నిక గురించి అన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఎలాగైనా హుజురాబాద్ ఎమ్మెల్యే సీటు తెరాస గెలవాలని పట్టు బట్టుకు కూర్చున్నారు కేసీఆర్. దీని కోసం ముఖ్యమైన మంత్రులను హుజురాబాద్ లో మకాం వేయించారు. వారంతా హుజురాబాద్ ఓటర్లను ప్రసన్నం చేసుకునే కార్యక్రమాలను మొదలెట్టారు.

ఇందులో భాగంగానే మొన్ననే హుజురాబాద్ నియోజకవర్గానికి కోట్ల రూపాయల నిధులను సమకూర్చారు. మరో వైపు రాజేందర్ కు మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిన్ననే హుజురాబాద్ కు చేరుకున్నారు. అక్కడున్న కార్యకర్తలను అందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చి వారందరికీ దిశానిర్దేశం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈటల రాజేందర్ రాజకీయ చతురత గురించి తెలిసిన కేసీఆర్ అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నారు. రాజేందర్ ను ఓడించడమే ప్రధాన లక్ష్యంగా అన్ని వ్యూహాలను సిద్ధం చేసుకున్నారు. కానీ అధికారంలో ఉన్న తెరాస ఇలా ఎందుకు భయపడుతోందో అర్ధం కావట్లేదని రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఈటల రాజేందర్ ఎక్కడ గెలుస్తాడా అన్న భయం కేసీఆర్ కు స్టార్ట్ అయిందా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉండి కూడా ఉప ఎన్నికలో ఓడిపోతే ఎలాగని సందిగ్ధంలో పడ్డారని అంటున్నారు.

కేసీఆర్ ఆలోచిస్తున్నదానికి కారణం లేకపోలేదు. ఈటల రాజేందర్ కు హుజురాబాద్ నియోజకవర్గంలో మంచి పేరుంది. ఓటర్లంతా రాజేందర్ వైపే నిలబడతారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని మరికొందరు చెబుతున్నారు. కేసీఆర్ అనుకుంటున్నట్లే ఈ ఎమ్మెల్యే ఉప ఎన్నికలో ఓడిపోతే అదే కేసీఆర్ సామ్రాజ్య వినాశనానికి నాంది అవుతుందని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఎంతో ఉత్కంఠగా మారుతున్న హుజురాబాద్ ఎమ్మెల్యే ఉప ఎన్నికలో ఏ పార్టీ విజయం సాధిస్తుందో తెలియడం లేదు. మరి ప్రజలు ఎవరి పక్షాన నిలబడతారో తెలియాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: