మహారాష్ర్టలోని పణేకు చెందిన నిఖిల్ అంకిత ఇద్దరూ వృత్తి రీత్యా డాక్టర్లుగా జీవనం సాగిస్తున్నారు. వీరు పుణేలోని వాన్వాడిలో గల ఆజాద్ నగర్ లో నివసిస్తున్నారు. ఈ డాక్టర్లకు 2019లో వివాహం అయింది. అప్పటి నుంచి సజావుగా సాగుతున్న కాపురంలోఅనుకోని విధంగా కలహాలు మొదలయ్యాయి. వీరిద్దరూ కూడా మొదట్లో వాన్వాడిలో ఒకే హాస్పిటల్ లో విధులు నిర్వర్తించేవారు. కానీ తర్వాత కొన్ని రోజులకు ఏమైందో ఏమో సడెన్ గా భర్త నిఖిల్ కర్సుద్దిలోని వేరే క్లినిక్‌లో చేరాడు. అప్పటి నుంచి ఈ యువ దంపతుల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. అయితే తాజాగా బుధవారం రోజు నిఖిల్ తాను పని చేసే క్లినిక్‌లో ఉన్న సమయంలో మానసిక సమస్యలతో బాధపడుతున్న ఒకరు ఫోన్ చేశారు. ఆ పేషెంట్ నిఖిల్ ఇంతకు ముందు పనిచేసిన ఆసుపత్రిలో ఉండగా... సదరు పేషెంట్ ను చూడమని నిఖిల్ అంకితను కోరాడు. కానీ అందుకు అంకిత నిరాకరించగా... వీరిద్దరి మధ్య మరలా గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన నిఖిల్ తన భార్య అంకిత ఫోన్ మాట్లాడుతుండగానే కాల్ కట్ చేశాడు.
దీనికి మనస్తాపం చెందిన అంకిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరో బాధాకరమైన విషయం ఏంటంటే.. ఇంటికి వచ్చి... తన భార్య ఉరి వేసుకుని ఉండడం చూసిన భర్త నిఖిల్ కూడా తనువు చాలించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి