అందుకే.. కొవిడ్ నుంచి కోలుకున్నా ఏమాత్రం ఏమరుపాటు తగదంటున్నారు నిపుణులు. ఎందుకంటే కరోనా నుంచి కోలుకున్న 41.8 శాతం మందిలో ఏదొక సమస్య ఉంటోందని గుర్తు చేస్తున్నారు. సరైన సమయంలో చికిత్స అందించడం అవసరమంటున్నారు. ఎందుకంటే.. కొవిడ్ అనే మహమ్మారి కోలుకున్నా ఇంకా వదిలిపెట్టడం లేదు. నీరసం, నిస్సత్తువతో రోగులు కొంచెం దూరమూ నడవలేకపోతున్నారు. కొందరిలో హఠాత్తుగా గుండెపోటుకూడా వస్తోంది. ఇంకొందరిలో మెదడు, ఊపిరితిత్తులు, జీర్ణకోశం, కాలేయం, కిడ్నీ, చెవి, ముక్కు, గొంతు, ఎముకలు వంటి అవయవాలపైనా దీని ప్రభావం దారుణంగా ఉంటోంది.
అందుకే.. కరోనా చికిత్సానంతర సమస్యలను ఎదుర్కోవడమే ఇప్పుడు అతి పెద్ద సవాల్ అంటున్నారు నిపుణులు. కొవిడ్ నుంచి కోలుకున్నా ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని సూచిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో దాదాపు 41.8 శాతం మంది ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారట. కరోనా నెగిటివ్ వచ్చినా కొవిడ్ నుంచి కోలుకున్నా.. 30 ఏళ్ల వయసులోనే గుండెపోటు, పక్షవాతం, బ్లాక్ ఫంగస్ వంటి ప్రమాదకర వ్యాధులు వస్తున్నాయట.
అంతే కాదు.. మధుమేహం, కీళ్లవాతం వంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్లు కూడా కరోనా వచ్చిపోయిన వారిని వేధిస్తున్నాయి. ఫస్ట్ వేవ్ కంటే ఎక్కువగా సెకండ్ వేవ్‌లో ఇలాంటి దుస్థితి కనిపిస్తోందట. ఎందుకంటే.. సెకండ్ వేవ్‌లో డెల్టా వేరియంట్ 90 శాతం ప్రభావం చూపిందట. ఇలాంటి కొవిడ్ అనంతర సమస్యలకు సత్వరమే చికిత్స అందించకపోతే.. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతాయని హెచ్చరిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి