ఈ మధ్యకాలంలో ఫైవ్ స్టార్ హోటల్స్ రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సాధారణంగా ఎవరైనా ఏం చేస్తారు ఒక మంచి ప్రదేశాన్ని చూసి ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించాలని భావిస్తూ ఉంటారు.  బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మిస్తే బిజినెస్ కూడా బాగుంటుందని ముందు జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు. కానీ రైలు పట్టాలపై   ఎవరైనా ఫైవ్ స్టార్ హోటల్ నిర్మిస్తారా. రైలు పట్టాలపై ఫైవ్ స్టార్ హోటల్ ఏంటి బాసు..  ఏమైనా జోక్ వేస్తున్నారా అంటారు ఈ మాట చెబితే ఎవరైనా. కానీ ఇలాంటి ఒక వినూత్న ప్రయత్నానికి ప్రస్తుతం సిద్ధమయ్యారు.



 రైలు పట్టాలపై ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించి సరికొత్త చరిత్ర సృష్టించాలని భారత రైల్వే సిద్ధమైంది. ఇటీవల కాలంలో భారత రైల్వే శాఖ అటు రైల్వే ను మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లు రూపురేఖలు మార్చేసి సుందరంగా తీర్చిదిద్దింది రైల్వే శాఖ.  ప్రయాణికులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తూనే ఉంది. ప్రస్తుతం దేశంలోని చాలా రైల్వే స్టేషన్లు అధునాతన టెక్నాలజీతో  రీ డిజైన్ చేయబడ్డాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు భారత రైల్వే శాఖ మరో సరికొత్త చరిత్ర  సృష్టించేందుకు సిద్ధమైంది.



 రైలు పట్టాలపై ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించేందుకు భారత రైల్వేశాఖ నిర్ణయించింది. గుజరాత్ లోని గాంధీ నగర్ రైల్వే స్టేషన్ లో ఈ తరహా ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించేందుకు భారత రైల్వే శ్రీకారం చుట్టింది. ఇప్పటికే గాంధీ నగర్ రైల్వే స్టేషన్ ను రీ డెవలప్ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇక ఇందులో భాగంగానే ఒక ఫైవ్ స్టార్ హోటల్ కూడా నిర్మించాలని అటు రైల్వే శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా గుజరాత్ రైల్వే స్టేషన్ లో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించేందుకు లీలా గ్రూప్ ఆఫ్ హోటల్స్ ముందుకు వచ్చినట్లు సమాచారం. రైల్వే స్టేషన్ లోని పట్టాలపై దృఢమైన  పిల్లర్లు నిర్మించి ఇక ఈ ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలను కూడా  సిద్ధం చేస్తున్నారట.  ఇది సక్సెస్ అయితే భారత రైల్వే శాఖ సరికొత్త చరిత్ర సృష్టించి నట్లే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: