ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్థాత్మకంగా తీసుకువచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థలో రేపటి నుంచి పెను మార్పులు జ‌ర‌గ‌బోతున్నాయి. దాదాపు రెండేళ్ల పాటు ఉద్యోగుల పనితీరును, సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్ వ్యవస్థ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించిన ప్రభుత్వం... కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.స‌చివాల‌యం ఉద్యోగులంతా స‌మ‌యానికి విధుల‌కు హాజ‌రుకావాల్సిందేన‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు గ్రామ స‌చివాల‌యాల్లో ఉద్యోగులంతా రిజిస్ట‌ర్‌ల‌లో సంత‌కాలు పెట్టేవారు.రేప‌టి నుంచి ఈ విధానానికి ప్ర‌భుత్వం స్వ‌స్తి ప‌లికింది.రేప‌టి నుంచి అన్ని గ్రామ‌,వార్డు స‌చివాల‌యాల్లో బ‌యోమెట్రిక్ విధానాన్ని ప్రారంభించున్నారు.ప్ర‌తి ఉద్యోగి ఆఫీస్‌కి వ‌చ్చిన‌ప్పుడు,వెళ్లేట‌ప్పుడు త‌ప్ప‌నిస‌రిగా బ‌యోమెట్రిక్ వేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ప్రతి ఉద్యోగి కూడా వారి వారి సచివాలయం పరిధిలోనే నివసించాలని పంచాయతీ రాజ్ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.ఎక్క‌డ ఉంటున్నారో పంచాయ‌తీ అధికారికి తెలియ‌జేయాల‌ని...స‌చివాల‌య ఉద్యోగి పూర్తి చిరునామా,వివ‌రాల‌ను ఆయా కార్యాల‌యాల్లో అంద‌రికి అందుబాటులో ఉంచాల‌ని కూడా ఆదేశాలు జారీ చేసింది.ప్రజల అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కూడా ఆ శాఖ ఉన్నతాధికారులు సూచించారు.ఏ ఒక్క ఉద్యోగైనా విధి నిర్వ‌హ‌ణ‌లో అల‌స‌త్వం వ‌హించిన స‌కాలంలో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌కపోయినా సంబంధిత ఉద్యోగిపై శాఖాప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టం చేసింది.

జులై నెల జీతం బయోమెట్రిక్ తో లింక్ అయి వస్తుందని.. ఎన్నిరోజులు హాజరు ఉంటే  అన్ని రోజులకే జీతం వస్తుందని ప్ర‌భుత్వం తెలిపింది.గ్రామ వార్డు స‌చివాలయాల్లో ఉద్యోగులు స‌రిగ్గా విధులు హాజ‌రుకావ‌డంలేద‌ని ప్ర‌భుత్వం గుర్తించింది.ఉద‌యం స‌చివాల‌యానికి వ‌చ్చి రిజిస్ట‌ర్‌లో సంత‌కం చేసి కొంతమంది ఉద్యోగులు వెళ్లిపోతున్నార‌ని ఉన్న‌తాధికారులు గుర్తించారు.స‌చివాల‌యంలో ప‌ని చేసే వారు ఆయా గ్రామ‌,వార్డు స‌చివాల‌య ప‌రిధిలో కాకుండా ఇత‌ర ప‌ట్ట‌ణాల్లో నివ‌సిస్తున్నార‌ని ప్ర‌భుత్వం గుర్తించింది,వీట‌న్నింటికి స్వ‌స్తి  ప‌లకాల‌ని ప్ర‌భుత్వం భావించింది.అందుకోస‌మే రేప‌టి నుంచి అన్ని గ్రామ‌,వార్డు స‌చివాల‌యాల్లో బ‌యోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: